Site icon HashtagU Telugu

PadmaShri: రాష్ట్రపతినే ఆశీర్వదించిన సామాన్య వ్యక్తి ఈయనే

ప్రతిసారి ప్రభుత్వం ఎంపిక చేసే ఈ అవార్డులకైనా ఎవరో ఒకరు పెదవి విరుస్తారు. ఈసారి మాత్రం పద్మ అవార్డులు అందుకున్న కొందర్ని చూస్తే అవార్డుకే అలంకారం లాగా అన్పిస్తోంది.

ఇటీవల కేంద్రం ఇచ్చిన పద్మ అవార్డు అందుకున్న వారిలో 102 యేండ్ల ఒడిశా టీచర్‌ నందా ప్రస్తీ ఒకరు. విద్యారంగంలో ఈయన చేసిన సేవలకు పద్మ పురస్కారం లభించింది.

నందా ఒడిశాలోని జాజ్‌పూర్‌లో పిల్లలతోపాటు పెద్దలకు ఉచిత విద్యను అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. తన గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించడమే తన లక్ష్యం అనుకున్నాడు.

ఇక అవార్డు తీసుకున్న సందర్భంలో ప్రస్తీ రాష్ట్రపతి కోవింద్‌ను రెండు చేతులతో ఆశీర్వదిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోను భారత రాష్ట్రపతి ట్విటర్‌ అకౌంట్‌ కూడా ట్వీట్ చేసింది.

 

https://twitter.com/rashtrapatibhvn/status/145807831281573888

Exit mobile version