ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌ట‌న‌.. వీరే విజేతలు!

సాధారణ భారతీయుల అసాధారణ కృషిని గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది పద్మ అవార్డులు దేశం నలుమూలల నుండి వెలుగులోకి రాని, గుర్తింపు పొందని అజ్ఞాత వీరులను గుర్తించాయి.

Published By: HashtagU Telugu Desk
Padma Awards

Padma Awards

Padma Awards 2026: 2026 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డుల ప్రకటన వెలువడింది. విజేతల ప్రాథమిక జాబితా కూడా బయటకు వచ్చింది. వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ప్రాథమిక జాబితాను మాత్రమే విడుదల చేశారు. విజేతల పేర్లతో కూడిన తుది జాబితాను సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి ముందు జనవరి 25 సాయంత్రం ఈ అవార్డులను ప్రకటించే ఆనవాయితీ ఉంది. ఈసారి కూడా అదే విధంగా జరిగింది.

వీరే అవార్డు విజేతలు

జాబితాలో అంకే గౌడ, అర్మిండా ఫెర్నాండెజ్, భగవాన్ దాస్ రైక్వార్, భికల్యా లాడ్క్యా ధిండా, బ్రిజ్ లాల్ భట్, బుధరి తాతీ, చరణ్ హెంబ్రమ్, చిరంజీ లాల్ యాదవ్, ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యా, గఫ్రూద్దీన్ మేవతి జోగి, హేలీ వార్, ఇంద్రజిత్ సింగ్ సంధు, కె. పజనీవేల్, కైలాష్ చంద్ర పంత్, ఖేమ్‌రాజ్ సుందరియల్, కొలక్కయిల్ దేవకి అమ్మ జీ, కుమారసామి తంగరాజ్, మహేంద్ర కుమార్ మిశ్రా, మీర్ హాజీభాయ్ కసంభాయ్, మోహన్ నగర్, నరేంద్ర చంద్ర దేబ్ వర్మ, నీలేష్ వినోద్ చంద్ర మాండ్లేవాలా పేర్లు ఉన్నాయి.

Also Read: ఎస్బీఐ వినియోగ‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌!

అలాగే నూరుద్దీన్ అహ్మద్, పద్మ గుర్మెట్, ఓతువర్ తిరుత్తణి స్వామినాథన్, పోఖిలా లెక్తేపి, పున్నిమూర్తి నటేశన్, ఆర్. కృష్ణన్, రఘుపత్ సింగ్, రఘువీర్ తుకారాం ఖేద్కర్, రాజస్థపతి కలియప్ప గౌండర్, రామా రెడ్డి మమిడి, రామచంద్ర గోడ్బోలే, సునీతా గోడ్బోలే, ఎస్జీ సుశీల్ అమ్మ, సంగ్యుసాంగ్ ఏ పొంగెనర్, షఫీ శౌక్, శ్రీరంగ్ దేవాబా లాడ్, శ్యామ్ సుందర్, సీమాంచల్ పాత్రో, సురేష్ హానగవాడి, తాగా రామ్ భీల్, తేజీ గుబిన్, తిరువారూర్ భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నామ్ జాత్రా సింగ్ కూడా ఈ అవార్డులను అందుకున్నారు.

గుర్తింపుకు నోచుకోని సమాజ సేవకులకు గౌరవం

సాధారణ భారతీయుల అసాధారణ కృషిని గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది పద్మ అవార్డులు దేశం నలుమూలల నుండి వెలుగులోకి రాని, గుర్తింపు పొందని అజ్ఞాత వీరులను గుర్తించాయి. ఈ ప్రముఖులందరూ వ్యక్తిగత పోరాటాలు, కష్టాలు, విషాదాలను ఎదుర్కొన్నప్పటికీ తమ రంగాలలో విశిష్ట సేవలందించడమే కాకుండా సమాజ సేవనే జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు.

అవార్డు గ్రహీతలలో వెనుకబడిన తరగతులు, దళిత వర్గాలు, ఆదిమ తెగలకు చెందిన వారు, మారుమూల ప్రాంతాల పౌరులు ఉన్నారు. వీరు దివ్యాంగులు, మహిళలు, పిల్లలు, దళితులు, గిరిజనుల సేవ కోసం తమ జీవితాలను అంకితం చేశారు. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, పారిశుధ్యం, సుస్థిర అభివృద్ధి వంటి రంగాలలో నిరంతరం కృషి చేస్తున్నారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా తమ విధులను నిర్వహిస్తూ భారత మాత సేవలో నిమగ్నమై ఉన్నారు.

హీమోఫీలియా వంటి స్థానిక ఆరోగ్య సవాళ్లపై పనిచేస్తున్న వైద్యుల నుండి, భారతదేశపు మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను స్థాపించిన నిపుణుల వరకు సరిహద్దు రాష్ట్రాల్లో జాతీయ సమగ్రతను బలోపేతం చేస్తూ భారతీయ స్వదేశీ వారసత్వాన్ని కాపాడే వారి నుండి, గిరిజన భాషలు, సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ (యుద్ధ కళలు)ను ప్రోత్సహించే వారి వరకు అంతరించిపోతున్న కళలు, చేనేత సంప్రదాయాల పరిరక్షణ నుండి దేశ పర్యావరణ సంపద రక్షణ, స్వచ్ఛత అభియాన్ వరకు.. ప్రతి ప్రతిభను, ప్రతి కృషిని ఈ అవార్డులతో గౌరవించారు.

  Last Updated: 25 Jan 2026, 04:36 PM IST