Site icon HashtagU Telugu

Oyo Founder : ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి దుర్మ‌ర‌ణం.. 20వ అంత‌స్తు నుండి..?

OYO

OYO

ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ మ‌ర‌ణించారు. గురుగ్రామ్ లోని ఎత్తైన భవనం 20వ అంతస్తు నుండి పడి మరణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. . రితేష్ అగర్వాల్ పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం కుటుంబంలో విషాదం నెల‌కొంది. త‌న తండ్రి రమేష్ అగర్వాల్ మార్చి 10న మరణించారని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఆయ‌న త‌న‌కు.. మనలో చాలా మందికి ప్రతిరోజూ స్ఫూర్తినిచ్చాడని రితేష్ అగర్వాల్ తెలిపారు. ఆయన మరణం త‌మ కుటుంబానికి తీరని లోటన్నారు.

ఈరోజు (శ‌నివారం) మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందిందని గురుగ్రామ్ ఈస్ట్ డీసీపీ తెలిపారు. “రమేష్ అగర్వాల్ ఎత్తైన భవనం (DLF ది క్రెస్ట్ )20 వ అంతస్తు నుండి పడిపోయాడని.. తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి పడిపోవ‌డంతో మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు తెలిపారు. అతను మరణించే సమయంలో అతని భార్య, కొడుకు రితేష్ అగర్వాల్, రితేష్ అగ‌ర్వాల్ భార్య. అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొర‌క‌లేద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ‌స‌భ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని.. శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసుల‌కు అప్పగించారు. ఈ వారం ప్రారంభంలో, 29 ఏళ్ల రితేష్ అగర్వాల్ ఫార్మేషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గీతాన్షా సూద్‌ను వివాహం చేసుకున్నాడు. ఢిల్లీలో జరిగిన రిసెప్షన్‌లో పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన మసయోషి సన్, భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, భారతీ ఎయిర్‌టెల్ సునీల్ మిట్టల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.