Atiq Murder Case: ఇది ముమ్మాటికి బీజేపీ హత్యే: అసదుద్దీన్ ఒవైసీ

ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. Atiq Murder Case

Atiq Murder Case: ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రాడికలైజేషన్‌ను అడ్డుకుంటానని ఉత్తరప్రదేశ్‌లో పర్యటించేందుకు తాను భయపడనని అన్నారు.

ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా నడుపుతోందని, తుపాకీ పాలనతో నడుస్తోందని విమర్శించారు. ఈ హత్యలో బీజేపీ ప్రభుత్వం పాత్ర ఉందని . సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపి కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏ అధికారిని కమిటీలో చేర్చకూడదని స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ కోల్డ్ బ్లడెడ్ హత్యేనంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఒవైసీ. రాష్ట్రంలో రాడికలైజేషన్ ఆపాలి. నేను తప్పకుండా ఉత్తరప్రదేశ్ సందర్శిస్తాను, నేను భయపడను. జబ్ ప్యార్ కియా తో దర్నా క్యా (నిన్ను ప్రేమించినప్పుడు మరణానికి ఎందుకు భయపడాలి) అంటూ స్లోగన్ వినిపించారు.

హంతకులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి?… వారిని చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేశారు? ఉగ్రవాదులు కాకపోతే ఏమంటారు? వారిని దేశభక్తులు అంటారా? ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటన తర్వాత దేశంలోని రాజ్యాంగం, శాంతిభద్రతలపై ప్రజలకు విశ్వాసం ఉంటుందా అని ఏఐఎంఐఎం చీఫ్ ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని ఒవైసీ డిమాండ్‌ చేశారు. అలాగే హత్య ఘటనలో ఉన్న పోలీసు అధికారులందరినీ సర్వీసు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్ ఒవైసీ.