Har Ghar Tiranga campaign : హర్ ఘర్ తిరంగా: 30 కోట్ల జెండా సేల్స్..500 కోట్ల బిజినెస్

హర్ ఘర్ తిరంగ అభియాన్‌.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసే మహత్తర కార్యక్రమం విజయవంతం అయింది.

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 10:25 AM IST

హర్ ఘర్ తిరంగ అభియాన్‌.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసే మహత్తర కార్యక్రమం విజయవంతం అయింది.ఈ సందర్భంగా 30 కోట్ల జాతీయ జెండాల విక్రయం జరిగి దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ నడిచింది.
గత కొన్ని సంవత్సరాల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ త్రివర్ణ పతాకాల వార్షిక విక్రయాలు దాదాపు రూ.150-200 కోట్లకు పరిమితమయ్యాయి. ఈసారి అంతకు మూడు రెట్ల జెండా సేల్స్ జరిగాయి. దేశ ప్రజల 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపు కునేందుకు.. 20 రోజుల స్వల్ప సమయంలో 30 కోట్లకు పైగా త్రివర్ణాలను తయారు చేశారు. జెండాల తయారీకి పాలిస్టర్, మెషీన్లను అనుమతిస్తూ ఫ్లాగ్ కోడ్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు కూడా దేశవ్యాప్తంగా జెండాలు సులభంగా అందుబాటులోకి రావడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఇంతకుముందు భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఖాదీ లేదా వస్త్రంలో మాత్రమే తయారు చేయడానికి అనుమతి ఉండేది. కాగా, హర్ ఘర్ తిరంగా ఉద్యమం వల్ల అమ్మకాలు మానిఫోల్డ్ రూ.500 కోట్లకు పెరిగాయి.