Site icon HashtagU Telugu

Terror : దేశరాజధానిలో భారీ కుట్ర భగ్నం…!!

Terrorism Story 647 1121170928

Terrorism Story 647 1121170928

దేశ రాజధానిలో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోవత్సం వేళ…ఈ కుట్ర జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులు పోలీసులు అరెస్టు చేశారు. ఆనందర్ విహార్ లో అరెస్టు చేసి వారి నుంచి 2,251 తూటాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు..ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులతోపాటు మార్కెట్ల వద్ద పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లలో నిరంతరం చెక్ చేస్తున్నారు. కాగా పంద్రాగస్టు నేపథ్యంలో ఢిల్లీలో పదివేల మందికిపైగా పోలీసులు మోహరించారు. రెడ్ ఫోర్టుకు వచ్చే దారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Exit mobile version