Fire accident: అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. 200కు పైగా ఇళ్లు దగ్ధం

అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

  • Written By:
  • Publish Date - November 23, 2022 / 09:00 PM IST

అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అసోం-నాగాలాండ్‌ సరిహద్దులోని కర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలో బుధవారం నాటి ఈ ప్రమాదంలో 200కు పైగా ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగి పలు బైకులు, కార్లు ఆహుతయ్యాయి. ఇళ్లలోని నగదు, ఆహారవస్తువులు, దుస్తులు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. రెస్క్యూ పని జరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని అధికారులంటున్నారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నికీలలు సంభవించాయని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

అంతకుముందు.. మేఘాలయకు చెందిన గ్రామస్తుల బృందం అస్సాంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో అటవీ శాఖ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, తగులబెట్టారు. మంగళవారం తెల్లవారుజామున కలపతో వెళ్తున్న ట్రక్కును పోలీసులు ఆపడంతో హింస చెలరేగింది. ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.మీడియా కథనాల ప్రకారం.. భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే గ్రామస్థులు వెళ్లిపోయారు. మేఘాలయలో అస్సాం నుండి వాహనాలపై దాడులకు సంబంధించిన నివేదికల నేపథ్యంలో భద్రతా కారణాలను చూపుతూ పొరుగు రాష్ట్రానికి వెళ్లవద్దని అస్సాం పోలీసులు వాహన యజమానులను కోరారు. అస్సాంలో నమోదైన వాహనాలను కొండ రాష్ట్రానికి తీసుకెళ్లవద్దని ప్రజలను కోరుతూ గౌహతి, కాచర్ జిల్లాలతో సహా అస్సాం నుండి మేఘాలయలోకి ప్రవేశించడానికి పోలీసు సిబ్బంది వివిధ పాయింట్ల వద్ద రోడ్‌ బ్లాక్‌లు చేశారు.