UP Hathras Stampede : 107కు చేరిన మృతుల సంఖ్య

ప్రస్తుతం మృతుల సంఖ్య 107 కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ చెపుతున్నారు

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 08:05 PM IST

యూపీలోని హత్రాస్ జిల్లా రతీభాన్పూర్లో (Uttar Pradesh’s Hathras) ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 107 కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్‌లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు

We’re now on WhatsApp. Click to Join.

ర‌తిభాన్పూర్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భోలా బాబా ఆధ్వ‌ర్యంలో శివ ఆరాధ‌న కార్య‌క్ర‌మం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భ‌క్తులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వేలాదిగా త‌ర‌లివ‌చ్చారు. ఇక ఆరాధన కార్య‌క్ర‌మం పూర్తికాగానే.. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌క్తులు ఒక్కసారిగా ప‌రుగులు పెట్టారు. అక్క‌డ చిన్న గేటు ఉండ‌డంతో ఒకేసారి అంద‌రూ ప‌రుగెత్త‌డంతో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో మొద‌ట 27 మందికి పైగా మ‌ర‌ణించారు. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ మంగ‌ళ‌వారం రాత్రి 07 గంటల వ‌ర‌కు ఆ సంఖ్య 107కు చేరుకుంది.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన సమయంలో చాలా వేడి, ఉక్కబోతగా ఉందని పోలీసులు తెలిపారు. ‘‘ఇది భోలే బాబా అనే మత బోధకుడి సత్సంగ సమావేశం.. మంగళవారం మధ్యాహ్నం ఎటావా, హత్రాస్ జిల్లా సరిహద్దులో ఉన్న ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహణకు తాత్కాలిక అనుమతి మంజూరు చేశాం’ అని అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు.

ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. ర‌తిభాన్పూర్‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉన్న‌త‌స్థాయి క‌మిటీ ఏర్పాటు చేసి, వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా , ఘటనలో గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు.

Read Also : Nara Lokesh : లోకేష్‌లో ‘కసి మామూలుగా లేదు’గా