Site icon HashtagU Telugu

Har Ghar Tiranga Effect : 10 రోజుల్లో ఎన్ని జాతీయ జెండాలు అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..!!

Independence Day 2023

Flag Imresizer

75వ స్వాతంత్ర్య దినోవత్సానికి యావత్ దేశం సిద్ధమవుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. భారతీయ పోస్ట్ డిపార్ట్ మెంట్ జెండాలను పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తోంది. తక్కువ ధరలో రూ. 25 ఒక్కో జెండాను అమ్ముతున్నారు. గత పది రోజుల్లో ఏకంగా ఒక కోటికి పైగా జెండాలు అమ్ముడుపోయినట్లు కేంద్ర ప్రసారశాఖ వెల్లడించింది.

దేశంలోని 1.5లక్షల పోస్టాఫీసుల ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి గడపకు చేరినట్లు తెలిపింది. పోస్టాఫీసుల్లో, ఆన్ లైన్ ద్వారా జెండాల అమ్మకాలు జరుగుతున్నట్లు వెల్లడించింది. దేశంలోని ఏ అడ్రెస్ కైనా సరే పోస్టల్ డిపార్ట్ మెంట్ ఫ్రీగానే జెండాలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ పోస్టు ఆఫీస్ పోర్టల్ ద్వారా 1.75 లక్షల జెండాలు ఆన్ లైన్లో అమ్ముడుపోయినట్లు చెప్పింది. ఈ రెండు రోజుల్లో మరింత పెద్దసంఖ్యలో జెండాలు అమ్ముడుపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.