Site icon HashtagU Telugu

Orissa New Cabinet : ఒడిశా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ… 21 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం

Odisa

Odisa

ఒడిశా కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగింది. సీఎం న‌వీన్ పట్నాయక్ ప్రభుత్వంలో 21 మంది కొత్త మంత్రులతో ఒడిశా గవర్నర్ గణేశి లాల్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చడానికి తన మంత్రులందరినీ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు. వారి స్థానంలో కొత్త వారిని నియ‌మించారు. 13 మంది మంత్రులు క్యాబినెట్ హోదాతో ప్రమాణ స్వీకారం చేయగా, ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులుగా చేరారు. తొలిసారిగా రాజ్‌భవన్‌లో కాకుండా లోక్‌సేవా భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

నిరంజన్ పూజారి, ప్రఫుల్ల కుమార్ మల్లిక్, టుకుని సాహు, నబా కిషోర్ దాస్, సమీర్ రంజన్ దాష్, రణేంద్ర ప్రతాప్ స్వైన్, అశోక్ చంద్ర పాండా, జగన్నాథ్ సారకా మరియు తుషారకాంతి బెహెరా వంటి తొమ్మిది మంది మంత్రులు రిటైన్ అయ్యారు. అంతేకాకుండా గత కేబినెట్‌లో లేని ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలను కూడా కొత్త బృందంలో చేర్చుకున్నారు. వారు ప్రమీలా మల్లిక్, ఉషా దేవి, ప్రతాప్ కేశరి దేబ్, అటాను సబ్యసాచి నాయక్, ప్రదీప్ కుమార్ అమత్ లు ఉన్నారు.

Exit mobile version