Apples – Drugs : పైకి చూడటానికి అతడొక యాపిల్ పండ్ల వ్యాపారి. కానీ లోలోపల చేసేది మాత్రం డ్రగ్స్ దందా. ఈవిధంగా పెద్దఎత్తున డ్రగ్స్‌ను అమ్ముతున్న ఓ వ్యక్తి ఆటకట్టయింది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
Also Read :Naked Trump Statue : ట్రంప్ నగ్న విగ్రహం వైరల్.. 43 అడుగుల పొడవు.. 2720 కేజీల బరువు
అతడి పేరు శశి నేగి. చాలామంది షామీ మహాత్మ అని కూడా పిలుస్తుంటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా నగరం కేంద్రంగా ఇతడు యాపిల్ పండ్ల వ్యాపారం చేసేవాడు. గత ఆరేళ్లుగా అతడు యాపిల్ పండ్లు అమ్ముతున్నాడు. ఈక్రమంలో అతడికి వాట్సాప్‌లోనూ బిజినెస్ ఆర్డర్లు వస్తుండేవి. అయితే ఆర్డర్స్ యాపిల్స్(Apples – Drugs) కోసం కాదని.. డ్రగ్స్ కోసమని తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వాట్సాప్‌లో డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని.. వెంటనే వాటిని సప్లై చేసేవాడు. వాట్సాప్‌లో ఆర్డర్ పొందిన వెంటనే ఆ డ్రగ్స్ వీడియోను తీసి కొనుగోలుదారుడికి శశినేగి పంపేవాడు. అనంతరం వాటి సప్లై కోసం నలుగురు వేర్వేరు వ్యక్తులను వాడుకునేవాడు. దీనివల్ల యాపిల్ వ్యాపారి తరఫున డ్రగ్స్ సప్లై చేసేవాళ్లకు ఆ సరుకు ఎక్కడికి చేరుతోందనే దానిపై క్లారిటీ రాదు.
Also Read :Dera Baba Parole: డేరా బాబాకు 20 రోజుల పెరోల్
యాపిల్ మాటున డ్రగ్స్ దందా చేస్తున్న శశి నేగికి కావాల్సింది కూడా అదే. డ్రగ్స్ కొనే వ్యక్తికి తాను ఎవరో తెలియకూడదనే స్కెచ్‌ను అతడు పక్కాగా అమలు చేసేవాడు. డ్రగ్స్ కొనేవాళ్ల నుంచి వివిధ బ్యాంకు అకౌంట్లలోకి డబ్బును జమ చేయించుకునేవాడు. కేవలం గత 15 నెలల్లో డ్రగ్స్ సప్లై ద్వారా శశి నేగికి దాదాపు రూ.3 కోట్ల దాకా ఆదాయం వచ్చిందట.ఇతడికి నైజీరియన్ డ్రగ్స్ ముఠాలతో పాటు హరియాణాలోని ఇతర ముఠాలతో లింకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శశి నేగి వద్ద డ్రగ్స్ సప్లై కోసం దాదాపు 40 మంది ఉన్నట్లు తేలింది. వీరి ద్వారా హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్రూ, జుబ్బల్- కోట్‌ఖాయ్, థియోగ్ ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవాడు. పోలీసులకు నిఘా వర్గాలు అందించిన సమాచారంతో శశినేగి డ్రగ్స్ దందా బట్టబయలైంది. శశినేగితో పాటు పాటు 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.