Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి.

  • Written By:
  • Updated On - December 18, 2023 / 03:46 PM IST

Parliament security breach: పార్లమెంట్ ఇటీవల జరిగిన  పొగ బాంబుల ఘటనపై ఈ రోజు ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లింది. రాజ్యసభ ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్ది సేపటికి ప్రతిపక్షాలు  సభ కార్యక్రమాలు ముందుకు సాగకుండా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేసాయి. ఆ ఘటనపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విచారణ జరుగుతుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పదే పదే  విజ్ఞప్తి చేసిన సభ అదుపులోకి లేకపోవడంతో సభను ఆయన కొద్ది సేపు వాయిదా వేశారు.

లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి. ఈ ఘటనపై చర్చకు ప్రతిపక్షాలు పట్టు పట్టయి. సభ ఉదయం 11 గంటలకు సమావేశం అయ్యాక స్పీకర్ ఓం బిర్లా  లోక్ సభలో యువత చొచ్చుకు వచ్చిన ఘటన విషయంపై ప్రకటన చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, అలాగే పార్లమెంట్ అంతర్గత ఉన్నత కమిటీ ద్వారా కూడా విచారణ జరుగుతుందని స్పీకర్ వెల్లడించారు.

అత్యున్నత ప్రజాస్వామ్య కేంద్రమైన పార్లమెంట్ ను సురక్షితంగా ఉంచడానికి అనేక చర్యలు ప్రారంభించామని తెలిపారు. అలాగే సభ్యులు కూడా ఈ అంశంలో సహకరించాలని విజ్ఞప్తి చేసారు. పార్లమెంట్ భద్రత తో పాటు , సభ లోపల కూడా సభ్యులు గౌరవ సంప్రదాయాలు పాటించేలా సభాధ్యక్ష స్థానానికి సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు.