BJP 300 : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు రావొచ్చని ఆయన జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అగ్రనేతలు చెబుతున్న విధంగా బీజేపీకి 370 సీట్లు రావని తెలిపారు. ప్రముఖ వార్తా సంస్థ ‘పీటీఐ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ఈ కామెంట్స్ చేశారు. ఈసారి దక్షిణ భారతదేశంలో బీజేపీ ఓట్ల వాటాతో పాటు సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంటుందని చెప్పారు. ‘‘బీజేపీ కానీ.. ప్రధాని మోడీ కానీ అజేయులు కాదు. వారిని ఓడించేందుకు మూడు వాస్తవిక అవకాశాలు ఉన్నాయి. అయితే సోమరితనం, తప్పుడు వ్యూహాల కారణంగా బీజేపీని ఓడించే అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోతున్నాయి’’ అని పీకే చెప్పారు. ‘‘తెలంగాణలో బీజేపీ(BJP 300) నంబర్ 1 లేదా నంబర్ 2 ప్లేసులోకి వస్తుంది. ఒడిశాలో బీజేపీ కచ్చితంగా నంబర్ వన్ అవుతుంది. పశ్చిమ బెంగాల్‌లో నంబర్ వన్ పార్టీగా బీజేపీ అవతరిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రశాంత్ కిశోర్ ఇంకా ఏమేం చెప్పారంటే..
- ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాల్లో కనీసం 100 సీట్లలో బీజేపీ ఓడిపోయేలా చేయగలిగితేనే ఇండియా కూటమికి విజయావకాశాలు పెరుగుతాయి.
- ఎక్కువ సీట్లు దొరికే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లపై ఇండియా కూటమి ఫోకస్ చేయాలి.
- ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ సీటును రాహుల్ గాంధీ వీడడం జనంలోకి తప్పుడు సందేశాన్ని పంపింది.
- ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి గెలవడం కష్టం. జగన్ సర్కారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నగదు బదిలీ చేస్తున్నప్పటికీ.. ఉద్యోగాలు కల్పించడం లేదు. ఏపీలో అభివృద్ధి పెద్దగా జరగలేదు.
- ఒడిశాలో బీజేపీ కచ్చితంగా నంబర్ వన్ అవుతుంది.
- పశ్చిమ బెంగాల్‌లో నంబర్ వన్ పార్టీగా బీజేపీ అవతరిస్తుంది.
- తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకుంటుంది.
- ఇండియా కూటమిలోని పార్టీలు ఒకదానిపై మరొకటి పోటీ చేయనంత మాత్రాన రిజల్టు మారదు. హిందీ బెల్ట్‌లో విపక్షాలు వీక్‌గా ఉన్నాయి.