Narendra Modi : భారతదేశంపై పాకిస్తాన్ తరచూ ‘అణు బెదిరింపులు’ చేస్తూ వచ్చిందన్నది తెలిసిందే. కానీ తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆత్మవిశ్వాసంతో, ఉగ్రదాడులకు వ్యతిరేకంగా మిలటరీ చర్యలతో పాకిస్తాన్‌కు గట్టి సందేశం పంపించారు. “భారత్ ఇకపై అణ్వాయుధాల బెదిరింపులకు భయపడదు” అనే భావనను అంతర్జాతీయ వేదికలపై కూడా సుస్థిరం చేశారు.
ఈ ఆపరేషన్‌లో భారత్ పాకిస్తాన్‌కు చెందిన కొన్ని కీలక ఎయిర్‌బేస్‌లపై స్పష్టమైన టార్గెట్ దాడులు జరిపింది. దీంతో గతంలో పాక్ కల్పించుకునే అణు ముప్పు నేటికి శూన్యమయ్యేలా మారింది. భారత చర్యల ఫలితంగా ఇప్పుడు పాకిస్తాన్ నేతల మాటల మట్టుకు మారింది.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల విద్యార్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ – “పాకిస్తాన్ అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నాం. అది దురాక్రమణ కోసం కాదు” అని చెప్పడం గమనార్హం. గతంలో ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగితే, పాకిస్తాన్ అణ్వాయుధాల జపంతో భారత్‌ను భయపెట్టే ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు షరీఫ్ ప్రకటన చూస్తే… పాక్‌కి భారత్ భయాన్ని పోగొట్టడం సాధ్యపడటం లేదని అర్థమవుతోంది.
గతంలో పాకిస్తాన్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ కూడా “భారత్ నీటి సరఫరాను ఆపితే, పాక్ అణు ప్రతీకారానికి వెళ్తుంది” అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. కానీ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం తక్షణమే ప్రతిస్పందన ఇచ్చింది. ఈ దాడి అనంతరం భారత్ తన అణు భద్రతా వ్యూహాన్ని సమర్థవంతంగా ప్రదర్శించింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ నేతలు ఒకట్రెండు పదాలు వెనక్కి తగ్గడం ప్రారంభించారు. ఇదంతా ఆపరేషన్ సిందూర్ వలన భారత్ సామర్థ్యం పాక్‌కు స్పష్టమయ్యిందని చెప్పడానికి తక్కువేమీ కాదు. భారత్ ఇక రాజకీయంగానే కాదు.. మిలటరీ స్థాయిలోనూ శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్న అంగీకారం ఇది.
Pavittar Batala : అమెరికాలో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్ – ఎన్ఐఏ, ఎఫ్‌బీఐ సంయుక్తంగా చర్యలు