Republic day parade : కేంద్రం కీలక నిర్ణయం.. వచ్చే రిపబ్లిక్ డే పరేడ్ లో అందరూ మహిళలే !

వచ్చే ఏడాది ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్ (Republic day parade) వెరీవెరీ స్పెషల్ గా నిలువనుంది. అట్టహాసంగా జరిగే ఆ కార్యక్రమంలో మార్చింగ్ (Republic day parade), బ్యాండ్ పార్టీ, శకటాల ప్రదర్శన సహా అన్ని విభాగాల్లో కేవలం మహిళా బృందాలే పాల్గొంటాయని రక్షణ శాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి.

Published By: HashtagU Telugu Desk
Parade

Parade

వచ్చే ఏడాది ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్ (Republic day parade) వెరీవెరీ స్పెషల్ గా నిలువనుంది. అట్టహాసంగా జరిగే ఆ కార్యక్రమంలో మార్చింగ్ (Republic day parade), బ్యాండ్ పార్టీ, శకటాల ప్రదర్శన సహా అన్ని విభాగాల్లో కేవలం మహిళా బృందాలే పాల్గొంటాయని రక్షణ శాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందంటూ మార్చిలో త్రివిధ దళాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వాటి పరిధిలోని విభాగాలకు రక్షణ శాఖ ఆఫీస్ మెమోరాండమ్‌ పంపిందని వెల్లడించాయి. దీనిపై ఫిబ్రవరి ప్రారంభంలోనే రక్షణ కార్యదర్శి అధ్యక్షతన “డి-బ్రీఫింగ్ సమావేశం” జరిగిందని, అధికారులు అటువంటి ప్రతిపాదనపై కసరత్తు ప్రారంభించారని మెమోరాండంలో ప్రస్తావించారని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దీనిపై కేంద్రం నుంచి తమకు కూడా అధికారిక లేఖ అందిందని, అయితే దీనిని ఎలా అమలు చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్సు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

also read : Republic Day Parade : రిపబ్లిక్ డే పరేడ్‌లో వారికి నో ఎంట్రీ..?

ఇక ఈ సంవత్సరం జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కూడా ‘నారీ శక్తి’ థీమ్‌తోనే జరిగింది. ఇందులో 144 మంది వైమానిక దళ యోధుల టీమ్ చేసిన పరేడ్ కు ఒక మహిళా ఆఫీసర్ నాయత్వం వహించి భళా అనిపించారు. మనదేశ చరిత్రలో తొలిసారిగా 2015 రిపబ్లిక్ డే వేడుకల్లో త్రివిధ దళాల నుంచి చెరొక మహిళా టీమ్ పరేడ్ లో పాల్గొంది. 2021లో రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా ​​కాంత్ పరేడ్ లో పాల్గొన్నారు. ఈ అవకాశం పొందిన తోలి మహిళా ఫైటర్ పైలట్ గా ఆమె రికార్డును సృష్టించారు. కాగా, భారత సైన్యం ఇటీవల తన ఆర్టిలరీ రెజిమెంట్‌లో ఐదుగురు మహిళా అధికారులను చేర్చుకుంది.

  Last Updated: 07 May 2023, 07:59 PM IST