Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ప్రధాని అభ్యర్థి అయితే మోడీ ఇంటికే…

2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గెలుపును అడ్డుకునేందుకు

Priyanka Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గెలుపును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి కదిలి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అనుకూలంగా కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసలు కురిపించారు.

2024లో విపక్షాలు ప్రధాని మోదీని ఓడించాలంటే జనాదరణ పొందిన నాయకుడు అవసరమన్నారు ఆచార్య ప్రమోద్. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ కంటే ఎక్కువ ప్రజాదరణ మరియు విశ్వసనీయమైన నాయకుడు లేడని నేను భావిస్తున్నాను అని చెప్పారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని, మోడీకి ప్రియాంక గాంధీ గట్టి పోటీనిస్తుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన. దీనికి ప్రతిపక్ష పార్టీలు సైతం ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇలా కానీ పక్షంలో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించడం కష్టమని పేర్కొన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అంగీకరించారని ఆచార్య తెలిపారు..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరియు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ తమతో నడిచి వస్తారని తెలిపారు.

Read More: chandrababu : అఖిల‌ప్రియ కు వార్నింగ్‌, ఏవీ వైపు చంద్ర‌బాబు