నో నెట్, నో కంప్యూటర్.. డిజిటల్ పాఠాలు సాగెదేలా.!

ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు కూడా మారుతున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి మాత్రం ఇసుమంతైనా మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి దేశంలోని గవర్న మెంట్ స్కూల్స్.

  • Written By:
  • Updated On - October 16, 2021 / 03:40 PM IST

ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు కూడా మారుతున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి మాత్రం ఇసుమంతైనా మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి దేశంలోని గవర్న మెంట్ స్కూల్స్. ప్రభుత్వ బడుల పిల్లలకు డిజిటల్ విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు.. ఆచరణలోకి వచ్చేసరికి గాలికొదిలేస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అధునాతన సౌకర్యాల సంగతి పక్కన పడితే కనీసం ఇంటర్ నెట్ కనెక్షన్ లేని స్కూళ్లు లెక్కకుమించి ఉన్నాయి. దేశంలో సగటున 10 లో 2 పాఠశాలలు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నాయట. యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్  నివేదిక 2019-20 ప్రకారం.. దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలల్లో 5.5 లక్షల పాఠశాలలు (37%) మాత్రమే కంప్యూటర్‌లు మరియు 3.3 లక్షలు (22%) ఇంటర్నెట్ యాక్సెస్ కలిగి చెప్పడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతోంది.

ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్ లో దాదాపు (50%) ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నాయి. 10 లో ఒకటి (11%) ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. అయితే, ప్రభుత్వ పాఠశాలలు కంప్యూటర్లను కొనుగోలు చేయడంలో కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ, ఎలాంటి ఫలితాలు సాధించలేకపోతున్నాయి. 2020 లో దేశంలో 500 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి, 77 కోట్లకు పైగా ఇంటర్నెట్ కనెక్షన్‌లు ఉన్నాయి. అయితే అదే సమయంలో ప్రభుత్వం పాఠశాలల్లో డిజిటల్ పెట్టెబడి పెట్టకపోవడం బాధాకరం అని చెప్పక తప్పదు. ఇదే విషయమై ఐఐఐటీ మాజీ డైరెక్టర్ సదాగోపన్ మాట్లాడుతూ “విధిగా ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. పిల్లలకు కేవలం ల్యాప్‌టాప్‌లను అందించడంతోనే ఆగిపోకూడదు. రోజురోజుకూ టెక్నాలజీ వాడకం పెరుగుతున్నందన కచ్చితంగా ఇంటర్ నెట్ ఫెసిలిటీ ఉండాల్సిందేనని ఆయన అన్నారు. ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించడంలో కేరళ, గుజరాత్ రాష్ట్రాల పనితీరు ఉత్తమంగా ఉన్నాయి. ఆ తరువాత పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ ఉన్నాయి.

 

ఏయే రాష్ట్రాల్లో.. ఏ మేరకు అందిస్తున్నాయంటే..

తెలంగాణలో 18

ఆంధ్రప్రదేశ్ 17

 

వరస్ట్ స్కూల్స్ ఇవే..

త్రిపుర 3 శాతం

మేఘాలయ 4

చత్తీస్ గడ్ 5

 

నెట్ ఉన్న రాష్ట్రాలు

చండీగఢ్ 97

కేరళలో 88