One Nation One Election : ‘‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ తొలిసారిగా ఇవాళ భేటీ కానుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా కమిటీలోని మొత్తం 8 మంది సభ్యులు ఈ మీటింగ్ కు హాజరు కానున్నారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో డిస్కషన్ జరగనుంది.
Also read : Diamond Ganesh: గుజరాత్ లో వజ్రాల వినాయకుడు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
దేశంలోని అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిచడం సాధ్యమా ? కాదా ? అనే అంశంపై ఈ కమిటీ ఫోకస్ చేయనుంది. ఇందుకోసం రాజ్యాంగంలో ఏమైనా సవరణలు చేయాల్సి ఉంటుందా అనేది కూడా చర్చించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీలో మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు (One Nation One Election) ఉన్నారు.