Vande Bharat Express: వందేభారత్‌ రైలుకు ప్రమాదం.. ఆవుతో పాటు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి

రాజస్థాన్‌‌ (Rajasthan)లోని కలిమోరి రైల్వే క్రాసింగు వద్ద, రైలు పట్టాలపై ఉన్న ఆవును వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) ఢీకొట్టింది. ఆ ఆవు గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో ఆవుతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందారు.

Published By: HashtagU Telugu Desk
Vande Bharat Express

Vande Bharat Exp

రాజస్థాన్‌‌ (Rajasthan)లోని కలిమోరి రైల్వే క్రాసింగు వద్ద, రైలు పట్టాలపై ఉన్న ఆవును వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) ఢీకొట్టింది. ఆ ఆవు గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో ఆవుతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందారు. ఆవు మీద పడి మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి శివదయాళ్‌గా పోలీసులు గుర్తించారు. రైలు ఢిల్లీ నుంచి అజ్‌మేర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

రాజస్థాన్‌లోని అల్వార్ నగరంలోని ఆరావళి విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిమోరి గేట్ సమీపంలో వందే భారత్ రైలు ఢీకొనడంతో ఆవు.. ఒక వృద్ధుడు మరణించాడు. అందిన సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న వందే భారత్ రైలును ఆవు ఢీకొని దాదాపు 30 మీటర్ల దూరంలో పడిపోయింది. ఈ సమయంలో అక్కడే నిలబడి ఉన్న వృద్ధుడిని ఆవు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమయంలో మరొక వ్యక్తి కూడా సమీపంలో నిలబడి ఉండగా అతను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రమాదంలో ఆవు కూడా మృతి చెందింది. మృతుడు ఆ ప్రాంతానికి చెందిన శివదయాళ్ శర్మ, రిటైర్డ్ రైల్వే ఉద్యోగిగా గుర్తించారు.

Also Read: America: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి ఆయుధ సాయం

ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అజ్మీర్ నుండి ఢిల్లీ కాంట్ వరకు నడుస్తుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు ఈ మార్గంలో ఏప్రిల్ 13 నుండి ప్రారంభించబడింది. ఈ రైలు నడిచిన తర్వాత, ఇప్పుడు దేశంలో 12 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా గతేడాది ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌లో 54 ఏళ్ల మహిళ మరణించింది. 29 అక్టోబర్ 2022న అదే రైలుకు ప్రమాదం జరిగింది. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆవు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం ధ్వంసమైంది.

  Last Updated: 20 Apr 2023, 08:48 AM IST