Site icon HashtagU Telugu

Manipur : మరోసారి మణీపూర్‌లో కాల్పులు..సీఆర్‌సీఎఫ్‌ జవాన్‌ మృతి

Once again firing in Manipur.. CRPF jawan died

Once again firing in Manipur.. CRPF jawan died

Manipur: మరోసారి మణీపూర్‌లోని జిరిబామ్‌ జిల్లా(Jiribam District)లో ఆదివారం సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(CRPF)జవాను ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సెయిజాంగ్‌ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీహార్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ డ్రైవర్ అజయ్ కుమార్ ఝా (43) నుదిటికి బుల్లెట్ గాయం కావడంతో జిరిబామ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు. మరో జవాను గాలికి గాయం కాగా, ఇద్దరు మణిపూర్ కమండోలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం జిరిబామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయుధ దుండగులకు, బలగాలకు మధ్య జరిగిన కాల్పులు మధ్యాహ్నం 11.30 గంటలకు ముగిసాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఆ తర్వాత భద్రతా సిబ్బంది(Security personnel) కోలుకొని తిరిగి కాల్పులు జరుపడంతో ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నది. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. కాగా, భద్రతా బలగాలపై దాడి గత ఐదువారాల్లో ఇది రెండోది. జూన్ 10న కాంగ్‌పోక్పి జిల్లాలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జిరిబామ్ జిల్లాలో జూన్‌6న రైతు సోయిబామ్ శరత్‌కుమార్ సింగ్ హత్యతో సహా ఇటీవలి హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయి.

Read Also: Raj Tarun Suicide Attempt : ఒంటరిగా ఉండలేక రాజ్ తరుణ్ ఆత్మహత్యయత్నం ..