Site icon HashtagU Telugu

Accident : వధువు ఇంటికి వెళ్తుండగా..లోయలో పడ్డ పెళ్లి బస్సు…25 మంది దుర్మరణం..!!

Uttarakhand

Uttarakhand

ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మంది దుర్మరణం చెందారు. లాల్ ధాంగ్ లోని కటేవాడ్ గ్రామం నుంచి హరిద్వార్ జిల్లాల్లోని కంద తల్లాకు వెళ్తున్న బస్సు సుమారు 300 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25మందిపై గా మరణించినట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 45మంది ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ ఆదేశించారు. బాధితులను అన్ని విధాలా అందుకుంటామన్నారు. కాగా బస్సులో నుంచి 8మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. జరిగిన విషయాన్ని ఫోన్ చేసి బంధువులకు తెలియజేయడంతో విషయం బయటకు వచ్చింది. సహాయక చర్యల్లో పోలీసులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సు కాలువలో వేలాడుతుందని…ఎలా రక్షించాలో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. బస్సు ఇర్కుక్కపోయిన ప్రదేశానికి వెళ్లడం కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో NDRF గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Exit mobile version