PM Modi On BJP : గ‌ర్వ‌ప‌డేలా బీజేపీ:మోడీ

దేశం గ‌ర్వ‌ప‌డేలా బీజేపీ ప‌నిచేస్తోంద‌ని 42వ ఆవిర్భావం సంద‌ర్భంగా మంత్రి మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు.

Published By: HashtagU Telugu Desk
Modi

Modi

దేశం గ‌ర్వ‌ప‌డేలా బీజేపీ ప‌నిచేస్తోంద‌ని 42వ ఆవిర్భావం సంద‌ర్భంగా మంత్రి మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పాల‌న సాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేశ భ‌క్తికి బీజేపీ అంకితం అయింద‌ని అన్నారు. ప్ర‌త్య‌ర్థులు కుటుంబ భ‌క్తిని క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని తెలియ‌చేయ‌డంలో బీజేపీ విజ‌యం సాధించింద‌ని పేర్కొన్నారు.పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కుటుంబ పాలనకు అంకితమైన పార్టీలు వివిధ రాష్ట్రాల్లో క్రియాశీలంగా ఉన్నప్పటికీ రాజ్యాంగ నిబంధనలను పెద్దగా పట్టించుకోవడం లేదని, అవినీతి, దుష్ప్రవర్తనను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. దేశంలోని యువతీ యువకులను పైకి రానివ్వకుండా, వారికి ద్రోహం చేశారని ప్రాంతీయ పార్టీల‌ను ప‌రోక్షంగా ఎత్తిపొడిచారు. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ నినాదాన్ని ప్రతిబింబిస్తూ కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృషి చేశాయని మోదీ నొక్కి చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలను ఆచరించాయ‌ని, సమాజంలోని కొన్ని వర్గాలకు వాగ్దానాలు చేసి మరికొందర‌ని విస్మరించారని అన్నారు. వివక్ష , అవినీతి ఆ పార్టీల రాజ‌కీయాల‌ను ప్ర‌త్య‌ర్థుల‌ను మోడీ విమ‌ర్శించారు.

  Last Updated: 06 Apr 2022, 05:05 PM IST