Chandrayaan3-August 5 : చంద్రయాన్-3 మిషన్ కు ఈరోజు (ఆగస్టు 5) వెరీ స్పెషల్..
ఎందుకంటే.. ఇవాళ సాయంత్రం ఇంచుమించు 7 గంటల సమయంలో చంద్రుని మొదటి కక్ష్యలోకి చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ ఎంటర్ అవుతుంది.
ఈ దశను “లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్” (LOI) అంటారు.
ఇప్పటికే స్పేస్ క్రాఫ్ట్ తన మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తి చేసింది.
ప్రస్తుతం చంద్రుని నుంచి దాదాపు 40 వేల కిలోమీటర్ల దూరంలో స్పేస్ క్రాఫ్ట్(Chandrayaan3-August 5) ఉంది.
Also read : Spying For China: చైనా కోసం గూఢచర్యం.. నేవీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన యునైటెడ్ స్టేట్స్..!
ఆగస్టు 5 నుంచి 16 దాకా చాలా ముఖ్యం..
ఆగస్టు 6వ తేదీన రాత్రి 11 గంటల ప్రాంతంలో చంద్రయాన్3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని రెండో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇక ఆగస్టు 9న మధ్యాహ్నం 2.45 గంటలకు చంద్రుని మూడో కక్ష్యలోకి ఎంటర్ అవుతుంది. నాలుగో చంద్ర కక్ష్యలోకి ఆగస్టు 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశిస్తుంది. ఐదో చంద్ర కక్ష్యలోకి ఆగస్టు 16న ఉదయం 8.30 గంటలకు ఎంటర్ అవుతుంది.
ఆగస్టు 17న ఏం జరుగుతుందంటే..
ఆగస్టు 17న చంద్రయాన్3 మిషన్ లో కీలక దశ. ఆ రోజు స్పేస్ క్రాఫ్ట్ లోని ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ విడిపోతాయి. అనంతరం వాటిని చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆగష్టు 18 నుంచి 20 మధ్య టైంలో.. ల్యాండర్ మాడ్యూల్ కు చంద్రుని కక్ష్యకు మధ్య దూరం తగ్గుతుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ 100 x 30 కి.మీ కక్ష్యలోకి వెళ్తుంది. చివరగా ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ జరుగుతుంది.