Congress Party Clashes : అధిష్టానంతో జీ 23 దోబూచులాట‌

కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ పై ఢిల్లీ కేంద్రంగా కీల‌క భేటీ జ‌ర‌గ‌నుంది. జీ 23 నేత‌ల స‌మావేశానికి నాయ‌క‌త్వం వ‌హించిన గులాంన‌బీ ఆజాద్ గురువారం సాయంత్రం సోనియాతో భేటీ అయ్యే అవ‌కాశం ఉంది.

  • Written By:
  • Publish Date - March 17, 2022 / 02:04 PM IST

కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ పై ఢిల్లీ కేంద్రంగా కీల‌క భేటీ జ‌ర‌గ‌నుంది. జీ 23 నేత‌ల స‌మావేశానికి నాయ‌క‌త్వం వ‌హించిన గులాంన‌బీ ఆజాద్ గురువారం సాయంత్రం సోనియాతో భేటీ అయ్యే అవ‌కాశం ఉంది. ఆ భేటీ త‌రువాత 2024 ఎన్నిక‌ల రూట్ మ్యాప్ వ‌స్తుంద‌ని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. సోనియాతో జ‌ర‌గ‌బోయే స‌మావేశం అస‌మ్మ‌తి నేత‌లు వాల‌కాన్ని తేల్చ‌నుంద‌ని మ‌రికొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత కలహాలపై గురువారం సాయంత్రం ఫోక‌స్ పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.జీ 23 లీడ‌ర్ల‌తో బుధ‌వారం అజాద్ స‌మావేశం అయ్యాడు. ఆ స‌మావేశానికి జీ 23 నేత‌ల‌తో పాటు మరికొంద‌రు హాజరయ్యార‌ని తెలుస్తోంది. గత ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల బృందం తెలిసిందే. తాజాగా “అన్ని స్థాయిలలో సమిష్టి , సమ్మిళిత నాయకత్వం ద్వారా నిర్ణయాధికారం నమూనా” అవలంబించడమే పార్టీ ముందున్న ఏకైక మార్గమ‌ని ఆజాద్ స‌మావేశంలో తీర్మానం చేయ‌డం జ‌రిగింది. ఆ తీర్మానంపై చ‌ర్చించ‌డానికి సోనియ‌ను క‌లిసేందుకు ఆజాద్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కానీ, ఆమె బ‌దులుగా రాహుల్‌, ప్రియాంక లు మాత్ర‌మే ఆజాద్‌కు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ కాంగ్రెస్ చెబుతోంది.

జీ 23 నేత‌లు ఆజాద్ నివాసంలో ఈ సమావేశమైన విష‌యం విదిత‌మే. ఆ నేతలు శశి థరూర్, మణిశంకర్ అయ్యర్, మనీష్ తివారీలతో సహా కొందరు కొత్త ముఖాలు కనిపించ‌డం ఈసారి జీ 23కి న్యూ లుక్‌. ఆ స‌మావేశం చేసిన తీర్మానం ప్ర‌కారం “ఇటీవలి ఫలితాల యొక్క నిరుత్సాహపరిచే ఫలితాలు…మా కార్యకర్తలు మరియు నాయకులు ఇద్దరూ నిరంతరం వలసపోతుండడం గురించి చర్చించడానికి మేము సమావేశమయ్యాము… బీజేపీని వ్యతిరేకించాలంటే, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అవసరం. 2024కి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం కోసం మార్గం సుగమం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇతర భావసారూప్యత గల శక్తులతో చర్చలు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరియు ఈ విషయంలో తదుపరి చర్యలు త్వరలో ప్రకటించబడతాయి.“ అంటూ తీర్మానం చేయ‌డం జ‌రిగింది. ఆ తీర్మానంపై చ‌ర్చించేందుకు సోనియాను ఆజాద్ క‌లుస్తార‌ని జీ 23 చెబుతోంది. కానీ, సోనియా గాంధీ కార్యాలయం నుండి అధికారిక ధృవీకరణ ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. అయితే, రాహుల్ , ప్రియాంక హాజరుకావచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. నాయకత్వంలో మార్పు కోసం G23 లోని సీనియ‌ర్ నాయకుడు కపిల్ సిబల్‌లో ధిక్కరించే స్వరం కనిపించింది. “చింతన్ శివర్లు” కాంగ్రెస్ సమస్యలను పరిష్కరించగలరని వారు భావిస్తే, ఉన్నతాధికారులు “కోకిల భూమి”లో నివసిస్తున్నారని ఆయన మీడియాతో సెటైర్ వేశాడు. స్వచ్ఛందంగా గాంధీలు పక్కకు తప్పుకుని మరొకరికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఎన్నికల పరాజయం తర్వాత పోస్ట్‌మార్టం సమావేశ నిర్వ‌హించి సోనియా గాంధీ, రాహుల్ ప్రియాంక రాజీనామా చేయాలని ప్రతిపాదించారు. అయితే, విధేయుల గ్రూప్ మాత్రం ఏకగ్రీవంగా రాజీనామా తీర్మానాన్ని తిరస్కరించబడింది. మొత్తం మీద ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ అధిష్టానం వ‌ర్సెస్ జీ 23 మ‌ధ్య దోబూచులాట క‌నిపిస్తోంది.