Site icon HashtagU Telugu

Oil Seeds : పంజాబ్‌, హ‌ర్యానాల్లో ‘నూనెగింజ‌ల’ సాగుపై ఫోక‌స్

Mustard Field

Mustard Field

పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో సాగు చేస్తోన్న వ‌రి, గోధుమల స్థానంలో నూనె గింజ‌ల పంట‌ల‌ను వేయాల‌ని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA), భారతదేశపు ప్రధాన కూరగాయల నూనె ప్రాసెసర్ల సంఘం (SEA) సంయుక్తంగా కోరాయి. ఆ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిక‌ను అందించాయి. వ‌రి, గోధుమ‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా నూనె గింజులు సాగుచేస్తే ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తి 25 లక్షల టన్నులు పెరగవచ్చని సీఈఏ అంచ‌నా వేస్తోంది. ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరింది.పంజాబ్‌, హ‌ర్యానాల్లో కొంత భూమిని గోధుమలు మరియు వరి ఉత్పత్తి నుండి ఖరీఫ్ సీజన్‌లో సోయా, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ఉత్పత్తికి మారాల‌ని సీఈఏ సూచించింది. రబీ సీజన్‌లో రాప్‌సీడ్ సాగుకు మళ్లించాల్సిన అవసరాన్ని తెలియ‌చేసింది.

దేశంలో కూరగాయల నూనె ఉత్పత్తిని పెంచడానికి, జన్యుపరంగా మార్పు చెందిన నూనెగింజల పంటల ఉత్పత్తిని ప్రోత్సహించడం మరియు ప్రవేశపెట్టడం వంటి ఇతర సూచనలను కూడా అసోసియేషన్ చేసింది.
దేశంలో జన్యుపరంగా మార్పు చెందిన (GM) నూనెగింజల పంటలను ప్రవేశపెట్టడం ప్రధాన సిఫార్సులలో ఒకటి. మెమోరాండం ప్రకారం, ఇది ఉత్పాదకతను 15 నుండి 20 శాతం పెంచవచ్చు. దేశంలో పత్తి గింజల నూనె ఉత్పత్తిలో పురోగతిని పేర్కొంది.ప్రస్తుతం 10 లక్షల టన్నుల రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తిని మూడు లక్షల టన్నులు పెంచగలిగితే, వచ్చే ఐదేళ్లలో ఈ మైనర్ ఆయిల్స్ దాదాపు 10 లక్షల టన్నుల ఎడిబుల్ ఆయిల్ పూల్‌కు చేర్చగలవని అసోసియేషన్ పేర్కొంది. ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్, ఇటీవల ప్రకటించిన జాతీయ మిషన్ ఆన్ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ – 2025-26 నాటికి ఆయిల్ పామ్ సాగులో 6.5 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణాన్ని , 2029-30 నాటికి – ఆవాలు, వేరుశెనగ, సోయాబీన్‌లను ఈ పథకంలో చేర్చాలని, ఏడాదికి కనీసం రూ. 5,000 కోట్లు కేటాయించాలని కోరింది.