Rahul Gandhi : తమిళనాడులో రాహుల్‌ గాంధీ హెలికాఫ్టర్‌ను తనిఖీ చేసిన అధికారులు

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 01:00 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి చెందిన హెలికాఫ్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు (Helicopter Checked). తమిళనాడు నీలగిరి జిల్లాలో రాహుల్‌ కోసం వచ్చిన హెలికాఫ్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

రాహుల్‌ గాంధీ సోమవారం ఉదయం తమిళనాడు నీలగిరి జిల్లా(Nilgiri District) నుంచి తన సొంత నియోజకవర్గమైన కేరళ(Kerala)లోని వయనాడ్‌(Wayanad)కు వెళ్తున్నారు. ఆయన్ని తీసుకెళ్లేందుకు హెలికాఫ్టర్‌ వచ్చింది. దీంతో ఎన్నికల ప్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు అక్కడికి చేరుకొని హెలికాఫ్టర్‌ను తనిఖీ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓటర్లకు పంచిపెట్టేందుకు డబ్బు, మద్యం, గిఫ్ట్‌లు వంటివి తీసుకెళ్తారన్న అనుమానంతో ప్రజా రవాణాతోపాటు అధికారుల వాహనాలను కూడా ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ తనిఖీలు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ రాహుల్‌ గాంధీ హెలికాఫ్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. కాగా, ఏప్రిల్ 26న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి వరుసగా ఆయన పోటీ చేస్తున్నారు.

Read Also: Elections : ఏపీ రాళ్ల రాజకీయాలు – మీవే ప్రాణాలా..మావీ కావా..?

మరోవైపు కోల్‌కతాలోని బెహలా ఫ్లయింగ్ క్లబ్‌లో తమ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీ చేశారని, ఐటి శాఖ “ఎగ్జిక్యూటివ్ ఓవర్‌రీచ్ మరియు అధికారాలను దుర్వినియోగం” చేసిందని ఆరోపిస్తూ భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం తెలిపింది.