Shocking Incident : ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో మానవత్వాన్ని మట్టగలిపే భయంకర ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర విద్య, చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి, అతడి శరీరాన్ని అమానుషంగా ధ్వంసం చేశారు. పోలీసులు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, 35 ఏళ్ల వ్యక్తిని గ్రామస్తులు చంపి అతడి ప్రైవేట్ భాగాలను కోసి, మృతదేహాన్ని హరభంగి డ్యామ్‌లో పారేశారు. ఈ సంఘటన స్థానికులను, రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది.
ఈ హత్య వెనుక కారణం గత రెండు వారాలుగా గ్రామంలో నెలకొన్న మూఢనమ్మకాలు. మోహన పోలీస్ స్టేషన్ పరిధిలోని మలసపదర్ గ్రామంలో రెండు వారాల క్రితం ఒక మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆ మరణానికి ఈ వ్యక్తే కారణమని గ్రామస్తులు భావించారు. అతను క్షుద్ర విద్య చేసి ఆ మహిళను చంపాడని వారు గట్టి అనుమానాలు వ్యక్తం చేశారు.
AP Weather : కోస్తా-రాయలసీమలో వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుదల.. వాతావరణ శాఖ హెచ్చరిక
గ్రామస్థుల బెదిరింపులు పెరగడంతో బాధితుడు తన కుటుంబంతో కలిసి గంజాం జిల్లాలోని తన మామ ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడే తలదాచుకున్నాడు. అయితే, తన పశువులను చూసుకోవాలని తన వదినను కోరాడు. శనివారం పశువులు, మేకలను తీసుకెళ్లడానికి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో గ్రామస్థులు అతడిని అడ్డగించి అపహరించారు. అనంతరం గొంతు నులిమి హత్య చేసి, అతడి జననేంద్రియాలను కత్తిరించి మృతదేహాన్ని హరభంగి డ్యామ్‌లో పడేశారు.
ఈ సంఘటన వెలుగులోకి రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 14 మంది గ్రామస్థులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఘటనకు బాధ్యులైన వారికి కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు.
ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది.మూఢనమ్మకాల పేరుతో ఒక నిరపరాధి ప్రాణం కోల్పోవడం పట్ల సామాజిక సంస్థలు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు, చేతబడి భయాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగించే విషయం అని నిపుణులు అంటున్నారు.
Mouth Ulcers : నోట్లో పుండ్లు పుట్టి ఏం తినలేకపోతున్నారా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది