Sensational Verdict : నమాజ్ చేస్తున్నాడని.. మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు

‘‘ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ ప్రతిరోజూ నమాజ్ చేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - July 1, 2024 / 04:14 PM IST

Sensational Verdict : ‘‘ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ ప్రతిరోజూ నమాజ్ చేస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’’ అని జూన్ 27న ఒడిశా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నమాజ్(Sensational Verdict) చేస్తున్నాడనే కారణంతో అతడి శిక్షను తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

  • 2014 సంవత్సరం ఆగస్ట్ 21న ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా తిర్టోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో దుకాణం నుంచి చాక్లెట్లు కొనుక్కొని వెళ్తున్న ఆరేళ్ల బాలికను ఎస్‌కే అఖీల్ అలీ (38), ఎస్‌కే ఆసిఫ్ అలీ (37) కిడ్నాప్ చేశారు.
  • ఆమెను ఎత్తుకెళ్లి  అత్యాచారం చేశారు. అనంతరం మర్డర్ చేశారు.
  • ఈ కేసును విచారించిన జగత్‌సింగ్‌పూర్‌లో ఉన్న పోక్సో కోర్టు.. బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు  వారిద్దరికి జీవితఖైదు, మర్డర్ చేసినందుకు మరణశిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2022 నవంబర్ 21న ఈ తీర్పు వెలువడింది.
  • దీనిపై అఖీల్, ఆసిఫ్ ఇద్దరు ఒడిశా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
  • ఇద్దరి పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ఈ నేరంలో పాత్ర ఉన్నట్టుగా ఆధారాలు లేనందున ఎస్‌కే అఖీల్ అలీని నిర్దోషిగా విడుదల చేసింది.
  • దోషిగా తేలిన ఆసిఫ్ అలీ మానసిక పరివర్తన సాధించి  రోజూ నమాజ్ చేస్తున్నందున అతడి మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
  • బాధిత బాలిక కుటుంబానికి కేవలం రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Also Read :Telangana Bandh : రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు..!