Site icon HashtagU Telugu

NTA Update : ఎన్‌టీఏ ‘ఎంట్రెన్స్‌’లకే పరిమితం.. రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించదు: కేంద్రం

Nta Update National Testing Agency Entrance Exams Recruitment Exams Dharmendra Pradhan

NTA Update : నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బాధ్యతలు మారాయి. ఇక ఎన్‌టీఏ ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహించదు. కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈమేరకు సంస్కరణలు చేశామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇకపై ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్‌టీఏ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.  2025 సంవత్సరం నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందన్నారు. ‘‘ఈ మార్పుల అమలు కోసం కొత్తగా పది పోస్టులను మేం క్రియేట్ చేశాం. జీరో ఎర్రర్‌ టెస్టింగ్‌ ఉండేలా ఎన్‌టీఏ(NTA Update) పనితీరు ఉండబోతోంది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టును ఇకపై ఏడాదికి ఒకసారే నిర్వహిస్తామన్నారు.

Also Read :MLC Kavitha : మూసీలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు చెల్లిస్తారా.. సర్కారుకు ఎమ్మెల్సీ క‌విత‌ ప్రశ్న

నీట్‌ యూజీ పరీక్షలను పెన్‌ పేపర్‌ విధానంలో నిర్వహించాలా ? ఆన్‌లైన్‌లో నిర్వహించాలా ? అనే దానిపై  ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖతో చర్చలు జరుపుతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రానున్న రోజుల్లో అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Also Read :Shock To Russia : రష్యాలో కలకలం.. ‘న్యూక్లియర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ అధిపతి హత్య

ఈ ఏడాది నీట్‌ యూజీ ప్రవేశపరీక్ష ప్రశ్నా పత్రం లీక్‌ అయింది. పలు ఇతర పరీక్షలలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.ఈనేపథ్యంలో  కేంద్ర సర్కారు ఆదేశాలతో విద్యాశాఖ ఉన్నతస్థాయి కమిటీ ఆయా అంశాలపై సమగ్ర అధ్యయనం చేసింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే ఇప్పుడు సంస్కరణల ప్రక్రియను మొదలుపెట్టారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో మార్పులు చేశారు.

ఎన్‌టీఏలో జాబ్స్ 

యంగ్ ప్రొఫెషనల్స్ (వైపీ) పోస్టుల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారు ఢిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 20 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను ఎన్‌టీఏ భర్తీ చేస్తోంది. nta.ac.in అనే వెబ్‌సైట్ ద్వారా డిసెంబరు 31లోగా దరఖాస్తులను సమర్పించవచ్చు.  బీఈ, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలలో కనీసం 60 శాతం మార్కులతో పాసైన వారు అప్లై చేయొచ్చు. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అయితే 40 ఏళ్లలోపు వయస్కులు మాత్రమే అప్లై చేయాలి.