NPS Vatsalya : నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎస్) పరిధిలో కొత్తగా తీసుకొచ్చిన ‘వాత్సల్య యోజన స్కీం’పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని 75 ప్రాంతాల్లో ఈ స్కీంను ఇవాళే అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం మైనర్ సబ్‌స్క్రైబర్లకు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ కార్డ్‌లను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ స్కీంలో తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో ఏడాది కనీసం రూ.1,000 పొదుపు చేయొచ్చు. ఈ పొదుపు మొత్తంపై చక్రవడ్డీ ఇస్తారు. ఇందులో లాంగ్ టర్మ్ కోసం పొదుపు చేస్తే మంచి బెనిఫిట్స్ లభిస్తాయి. పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ ఖాతాను ఎన్‌పీఎస్ ఖాతాగా మారుస్తారు.
Also Read :Lalu Prasad : రైల్వే ఉద్యోగాల స్కాంలో లాలూకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు
ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన ద్వారా తల్లిదండ్రులు పిల్లల కోసం పెద్ద కార్పస్‌ను తయారు చేయొచ్చు. భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ తమ పిల్లల పేరిట వాత్సల్య యోజన(NPS Vatsalya) అకౌంటును తెరవొచ్చు. సదరు బాలుడు లేదా బాలికకు 18 ఏళ్లు నిండాక అకౌంటు నుంచి నిధులను విత్‌డ్రా చేయొచ్చు. ఒకవేళ విత్ డ్రా చేయకుంటే తల్లిదండ్రులు 60 సంవత్సరాల వయసు వచ్చాక ఈ స్కీం నుంచి పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీం మధ్యకాలంలో ఎప్పుడైనా డబ్బులు అత్యవసరమైతే కనీసం మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పొదుపు మొత్తంలో నుంచి 25 శాతం విత్‌డ్రా చేయొచ్చు. విద్య, తీవ్రమైన అనారోగ్యం, వైకల్యం వంటి అవసరాలకు ఈ డబ్బును వాడుకోవచ్చు. ఈవిధంగా ఏడాదిలో గరిష్టంగా మూడుసార్లు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీంను వినియోగించుకొని దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల డెవలప్ కావచ్చు. తమ పిల్లల భవిష్యత్ ఉన్నత విద్యా అవసరాలను తీర్చుకోవచ్చు. ఫలితంగా ఆకస్మిక ఖర్చుల బెడద నుంచి తప్పించుకోవచ్చు.