Site icon HashtagU Telugu

MNP : ‘సిమ్ స్వాప్’ మోసాలకు చెక్.. ‘మొబైల్ నంబర్ పోర్టింగ్’ ​కొత్త రూల్

Mobile Number Portability

Mobile Number Portability

MNP : మన ఫోన్ నంబర్ మారకుండానే టెలికాం ఆపరేటర్‌ను మార్చుకోవడాన్ని మొబైల్ నంబర్ పోర్టబులిటీ (MNP) అంటారు.  దీనికి సంబంధించి జులై 1 నుంచి ఒక కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) ప్రకటించింది. దీని ప్రకారం. ఇకపై మొబైల్ నంబర్​ పోర్టింగ్​ కోసం కనీసం 7 రోజులు ఆగాల్సి ఉంటుంది. సిమ్​ స్వాప్​ స్కామ్స్​ నుంచి యూజర్లను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ తెలిపింది. కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్నవాళ్లు, తమ నంబర్​ను వేరే టెలికాం ఆపరేటర్​కు మార్చాలని అనుకునేవాళ్లు కనీసం 7 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

సిమ్ కార్డు పోయినా, డ్యామేజ్ అయినా లేదా దానిని అప్​గ్రేడ్ చేయాలని అనుకున్నా సదరు మొబైల్​ నంబర్​ పోర్టబిలిటీ కోసం అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి మీకు నచ్చిన నెట్​వర్క్​కు మీ మొబైల్ నంబర్​ను పోర్ట్ చేసుకోవచ్చు. ట్రాయ్ తొలిసారిగా మొబైల్​ నంబర్ పోర్టబిలిటీ (MNP) నిబంధనలకు 2009 సంవత్సరంలో  తీసుకొచ్చింది. అనంతర కాలంలో ఆ రూల్స్​ను పలుమార్లు సవరించింది. ఇప్పుడు మరో నిబంధనను అమల్లోకి తెస్తుండటం ఇది తొమ్మిదోసారి.

Also Read : Happiest Countries 2024 : అత్యంత సంతోషకర దేశాలివే.. ఇండియా ర్యాంక్ ఇదీ

‘సిమ్ స్వాపింగ్’.. అంటే ?

మొబైల్​ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఆసరాగా చేసుకొని కొందరు సైబర్‌ క్రిమినల్స్‌ సిమ్‌ స్వాపింగ్‌ మోసాలకు తెగబడుతున్నారు. ప్రధానంగా సిమ్‌ స్వాపింగ్‌కు పాల్పడుతున్నారు. ఉదాహరణకు మీ వద్ద పాతకాలం మొబైల్‌ ఉందనుకోండి. అందులో మామూలు పెద్ద సిమ్‌ కార్డు పడుతుంది. ఆ ఫోన్‌ పాడైపోవడంతో కొత్త ఫోన్‌ కొన్నారు. దాంట్లో మైక్రో సిమ్‌ కార్డు మాత్రమే పడుతుంది. అప్పుడు మీరు మీ ఆపరేటర్‌ను అడిగితే.. మైక్రో సిమ్‌ కార్డు ఇస్తారు. దీన్నే సిమ్‌ స్వాప్‌ అంటారు. సైబర్‌ నేరగాళ్లు మన ఫోన్‌లోని సమాచారాన్నంతా దొంగిలించి.. దాని ఆధారంగా మన వివరాలతో మన నంబర్‌నే వాళ్లు సిమ్‌ స్వాప్‌ ద్వారా పొందితే? అప్పుడు మనకు రావాల్సిన ఓటీపీలన్నీ వాళ్లకే వెళ్లిపోతాయి. మన బ్యాంకు ఖాతాలు ఇక ఖాళీ అయిపోతాయి. ఈ ముప్పును తప్పించడానికే ట్రాయ్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.  ఆన్​లైన్ ఫ్రాడ్​స్టర్స్​కు చెక్​ పెట్టేందుకు ట్రాయ్​ ఈ మొబైల్ పోర్టబిలిటీ రూల్స్​ను కఠినతరం చేసింది. సిమ్ పోర్టబిలిటీకి 7 రోజుల వెయిటింగ్ పీరియడ్​ను తప్పనిసరి చేసింది. దీని వల్ల యూజర్లకు తెలియకుండా, వారి నంబర్​లను స్కామర్లు వేరే నెట్​వర్క్​లకు బదిలీ చేయలేరు. అంటే స్కామర్ల బారి నుంచి యూజర్లు సురక్షితంగా ఉండేందుకు ఈ నయా రూల్స్ ఉపయోగపడతాయని ట్రాయ్​ భావిస్తోంది.

Also Read :Amardeep: అమర్దీప్,సురేఖ వాణి మధ్య అలాంటి రిలేషన్ ఉందా.. సుప్రీతకు ఆఫర్ రావడం వెనుక కారణం ఇదే?