Chandrayaan 4 : చంద్రయాన్-4 కోసం ప్లానింగ్.. ఏమేం చేస్తారు ?

Chandrayaan 4 : చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపడం అమెరికా, రష్యా వల్ల కూడా కాలేదు.

  • Written By:
  • Publish Date - November 20, 2023 / 10:06 AM IST

Chandrayaan 4 : చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపడం అమెరికా, రష్యా వల్ల కూడా కాలేదు. కానీ భారత్ దాన్ని చేసి చూపించింది. అసాధ్యాన్ని సుసాధ్యం  చేసే సత్తా తనకు ఉందని భారత్‌ నిరూపించింది. ఇప్పుడు చంద్రయాన్‌-4 ప్రయోగానికి మన అంతరిక్ష ప్రయోగ సంస్థ ‘ఇస్రో’ రెడీ అయింది. ‘లుపెక్స్‌’ అంటే.. లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌. చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టిని తీసుకొచ్చేందుకు ‘లుపెక్స్‌’ పేరుతో చంద్రయాన్-4 మిషన్‌ను ఇస్రో చేపట్టనుందట. ఈవిషయాన్ని తాజాగా ఇస్రో స్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ వెల్లడించారు. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగాక.. దానిలో నుంచి 350 కేజీల బరువున్న రోవర్‌ చంద్రుడిపైకి ఎంటరవుతుంది. అది చంద్రుడిపై దాదాపు కిలోమీటరు ఏరియాలో చక్కర్లు కొట్టి మట్టి, రాళ్ల నమూనాలను సేకరిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రయాన్-3 ప్రయోగం కేవలం 14  రోజుల్లో పూర్తయింది. కానీ చంద్రయాన్-4‌ ద్వారా మనం పంపబోయే ల్యాండర్, రోవర్‌లు చంద్రుడిపై ఏకంగా 100 రోజుల పాటు యాక్టివ్‌గా పనిచేస్తాయి. రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమిపైకి కూడా తీసుకొస్తాయి. ఇందుకు అవసరమైన రెండు లాంచ్‌ వెహికల్స్‌‌ను తయారు చేసేందుకు ఇస్రోకు ఇంకో ఐదు నుంచి పదేళ్ల టైం పడుతుందట.

Also Read: Liquor Sales : ఎన్నికల టైం.. అయినా లిక్కర్ సేల్స్ డౌన్