18% GST on House Rent: ఇక ఇంటి అద్దెపై కూడా 18 శాతం

జీఎస్టీ మోత తప్పదు. ఈ వార్త విని అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..జులై 18 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన అందరికీ వర్తించదు.

Published By: HashtagU Telugu Desk
GST Rate Cut Off

GST Rate Cut Off

జీఎస్టీ మోత తప్పదు. ఈ వార్త విని అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..జులై 18 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన అందరికీ వర్తించదు. జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు అద్దెకున్నప్పుడు మాత్రమే 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మిగితా వాళ్ళు ఇది పే చేయాల్సిన అవసరం లేదు. యజమాని, అద్దెకు ఉంటున్న వారు ఇద్దరూ జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అద్దెకుండే వారే జీఎస్టీ చెల్లించాలి. ఇద్దరూ జీఎస్టీలో రిజిస్ట్రేషన్ కాకుంటే ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదు.అద్దె పన్ను చెల్లించిన తర్వాత ‘ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్’ కింద మినహాయింపు పొందవచ్చు. శాలరీపై ఆధారపడి, అద్దెకుండేవారు కూడా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరమే లేదు. కాగా, గతంలో ఆఫీసులు, వాణిజ్య, వ్యాపార సముదాయాల వంటి కమర్షియల్ స్పేస్ కు మాత్రమే అద్దెపై జీఎస్టీ నిబంధన ఉండేది.

యజమాని జీఎస్టీ అడిగితే..

మరి.. పన్ను చెల్లించాల్సిన వారు ఎవరు? అన్న ప్రశ్నకు చట్టం చెప్పేదేమంటే.. స్థూలంగా రూ.20లక్షలు అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు, ఏటా రూ.40 లక్షలు టర్నోవర్ చేసే వ్యాపారులు, వారు చెల్లించే అద్దెపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన వారు ఎవరూ కూడా అద్దె మీద జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా యజమాని తాము జీఎస్టీ చెల్లిస్తున్నామని, తమకు అద్దెతో పాటు చెల్లించాలని చెబితే అనవసరంగా ఆగం కాకుండా రూల్ పొజిషన్ చూపిస్తే సరిపోతుంది. కాగా, ప్యాక్ అయి ఉండే పాలు, పెరుగు, నిత్యావసర వస్తు ఉత్పత్తులపైనా జీఎస్టీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  Last Updated: 13 Aug 2022, 12:04 AM IST