November Bank Holidays 2023 : నవంబర్ నెలలో ఏకంగా బ్యాంకులకు 15 రోజులు సెలవులు

నవంబర్ నెలలో ఏకంగా 15 రోజులపాటు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నట్లు రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) తెలిపింది

  • Written By:
  • Publish Date - October 31, 2023 / 12:41 PM IST

 

నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లోనే కాదు బ్యాంకు ఖాతాదారుల్లో (Bank Customers) కొత్త టెన్షన్. సామాన్య ప్రజలు గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో..అనేది చూస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

రేపటి నుండి నవంబర్ (November ) నెల మొదలుకాబోతుంది. సో బ్యాంకు ఖాతాదారులంతా నవంబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు (November Month Bank Holidays) పనిచేయబోతున్నాయి..ఎన్ని రోజులు సెలవులు ఉండబోతున్నాయి..అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో ఏకంగా 15 రోజులపాటు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నట్లు రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) తెలిపింది. నవంబర్ 11- నుంచి 14 మధ్య నాలుగు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవు ఉండనున్నాయి.

  • 11వ తేదీన రెండో శనివారం
  • 12వ తేదీన ఆదివారం వారాంతపు సెలవు.
  • 13, 14 తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని నగరాల్లోని బ్యాంకులు మూసే ఉంటాయి.
  • బాయ్ దోజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (దీపావళి/నింగోల్ చాకౌబా/భ్రాత్రిద్వితీయ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో 15న బ్యాంకులకు సెలవు ఉండనుంది.
  • 20వ తేదీన ఛాత్ పూజ సందర్భంగా బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి.
  • 23న సెంగ్ కుట్స్ నెమ్, ఈగాస్ బాగ్వాల్ పండుగల సందర్భంగా ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • 27న గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పౌర్ణమి సందర్భంగా సెలవు.
  • 30న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు. ఈ సెలవులు అన్ని రాష్ట్రాల బ్యాంకులకు వర్తించవు. ఆయా రాష్ట్రాల క్యాలెండర్‌ను బట్టి ఉంటాయి.

ఇక వారాంతపు సెలవులు చూస్తే..

  • నవంబర్ 5: ఆదివారం
  • నవంబర్ 11: రెండో శనివారం
  • నవంబర్ 12: ఆదివారం
  • నవంబర్ 19 : ఆదివారం
  • నవంబర్ 25: నాలుగో శనివారం
  • నవంబర్ 26: ఆదివారం

Read Also : Chandrababu : పులి బయటకు వస్తుంది..ఇక ఆట మొదలైనట్లే