Site icon HashtagU Telugu

Goldy Brar: గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు

Goldy Brar

Safeimagekit Resized Img (1) 11zon

Goldy Brar: పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్‌వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ సతీవందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ (Goldy Brar) మృతి ఆరోపణలను అబద్ధమని అమెరికా పోలీసులు అభివర్ణించారు. కాలిఫోర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెస్నో ప్రాంతంలో బుధవారం కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు, వారిలో ఒకరు ఆసుపత్రిలో మరణించారు. అయితే, మ‌ర‌ణించిన‌ వ్యక్తి గోల్డీ బ్రార్ కాదని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వ్యక్తిని 37 ఏళ్ల జేవియర్ గాలాడ్నీగా గుర్తించారు. నిన్న రోజంతా నివేదికలు గోల్డీ బ్రార్ అమెరికాలో కాల్చి చంపబడ్డారని పేర్కొన్నాయి.

ప్రపంచం నలుమూలల నుంచి విచారణలు వచ్చాయి

ఫ్రెస్నో పోలీస్ డిపార్ట్‌మెంట్ లెఫ్టినెంట్ విలియం జె. డూలీ మాట్లాడుతూ.. ప్రపంచం నలుమూలల నుండి గోల్డీ బ్రార్ గురించి మాకు విచారణలు వస్తున్నాయి. ఆయన మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీన్ని ఎక్కడ నుండి ఎవరు ప్రారంభించారో మాకు తెలియదని ఆయ‌న తెలిపారు.

Also Read: Team India Squad: ఏ ఫ్రాంచైజీ నుండి ఎంతమంది ఆటగాళ్లకు టీమిండియాలో చోటు ద‌క్కింది..?

ABC న్యూస్ ప్రకారం.. బుధవారం జరిగిన సంఘటన గ్యాంగ్ వార్‌కు సంబంధించినది. కాల్పులు జరిపిన డారెన్ విలియమ్స్ అనే నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెరోన్ విలియం, జేవియర్ గాలాడ్నీపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడు కూడా గాయపడి ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.

గోల్డీ బ్రార్ ఎవరు?

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ UAPA కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. అతనికి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)తో సంబంధాలు ఉన్నాయి. గోల్డీ బ్రార్ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి కుడి చేయి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత అతను వెలుగులోకి వచ్చాడు.

We’re now on WhatsApp : Click to Join

గోల్డీ బ్రార్ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ నివాసి. 1994లో జన్మించిన అత‌నికి తల్లిదండ్రులు అతనికి సత్వీందర్ సింగ్ అని పేరు పెట్టారు. తండ్రి పోలీస్ శాఖ‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. అతను కూడా తన కొడుకును చదివించి, సమర్థుడిగా మార్చాలనుకున్నాడు. కానీ సత్వీందర్ అలియాస్ గోల్డీ తన మార్గాన్ని ఎంచుకున్నాడు. గోల్డీ బ్రార్ బంధువు గుర్లాల్ బ్రార్ చండీగఢ్‌లో హత్యకు గురయ్యాడు. 11 అక్టోబర్ 2020 రాత్రి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్-1లో ఉన్న క్లబ్ వెలుపల గుర్లాల్‌పై కాల్పులు జరిగాయి. అతను పంజాబ్ విశ్వవిద్యాలయం (PU) విద్యార్థి నాయకుడు. గుర్లాల్ బ్రార్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు. గుర్లాల్ బ్రార్, లారెన్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ (SOPU)తో అనుబంధం కలిగి ఉన్నారు. గుర్లాల్ బ్రార్ హత్య తర్వాత లారెన్స్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్త యుద్ధం ప్రారంభమైందని, వీధుల్లో రక్తం ఎండిపోదని రాశారు.