Railway Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో 2500పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..!

  • Written By:
  • Updated On - November 24, 2022 / 12:23 PM IST

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించింది రైల్వే శాఖ. వెస్ట్ సెంట్రల్ రైల్వే లో పెద్దెత్తున రిక్రూట్ మెంట్ చేపట్టింది. వెస్ట్ సెంట్రల్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం…2521 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ wcr.indianrailways.gov.inలో డిసెంబర్ 17 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం…ఈ ప్రక్రియ ద్వారా రైల్వేలో ఖాళీగా ఉన్న 2521 అప్రెంటీస్ పోస్టులపై రిక్రూట్ మెంట్ జరుగుతుంది. ఇందులో జనరల్ కేటగిరికి 1046, షెడ్యూల్డ్ కులాలకు 375 , షెడ్యూల్ తెగలకు 181, ఇతరులకు 674, ఆర్థికంగా వెనకబడిని వారికి 245పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన అర్హత, అభ్యర్థులు తప్పనిసరిగా 50శాతం మార్కులతో పదవ తరగతి పాస్ అయి ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ చేసి ఉండాలి. కనీస వయస్సు 15 సంవతరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 24ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ కేటగిరి కింద వచ్చే అభ్యర్థులకు గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వనుంది.

పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిజ్ జాబితాను తయారు చేస్తారు. ఈ జాబితా ఆధారంగా అభ్యర్థులు మాత్రమే రిక్రూట్ మెంట్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు. దరఖాస్తు రుసుము కేవలం 100రూపాయలు మాత్రమే. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వర్గానికి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయించారు.