Nagarjuna: అక్రమ కట్టడం ఆపాలంటూ నాగార్జునకు నోటీసులు.. ఎక్కడి నుంచి అంటే!

అక్కినేని నాగార్జునకు తాజాగా అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందాయి. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్న నాగ్‌.. రీసెంట్‌గా బిగ్‌ బాస్‌ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు సినిమాల్లోనూ, ఇటు రియాల్టీ షోలతో బిజీగా ఉన్న నాగ్‌కు తాజాగా ఓ నోటీసు రావడం కలకలం రేపుతోంది.

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 08:34 PM IST

అక్కినేని నాగార్జునకు తాజాగా అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందాయి. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్న నాగ్‌.. రీసెంట్‌గా బిగ్‌ బాస్‌ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు సినిమాల్లోనూ, ఇటు రియాల్టీ షోలతో బిజీగా ఉన్న నాగ్‌కు తాజాగా ఓ నోటీసు రావడం కలకలం రేపుతోంది. అయితే, ఈ నోటీసులు వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచి కాదు.. మరెక్కడి నుంచో ఈ కథనంలో వివరాలు తెలుసుకోండి..

సీనియర్‌ హీరో నాగార్జునకు గోవా నుంచి నోటీసులు వచ్చాయి. అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ.. నాగార్జునకు గోవాలోని మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్​ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆ గ్రామంలో నాగార్జునకు సంబంధించిన నిర్మాణ పనులను జరుగుతున్నాయని, అవి వెంటనే ఆపేయాలని ఆ పోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. పనులు వెంటనే ఆపకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.

ఈ మేరకు ఉత్తర గోవాలోని మాండ్రేమ్ గ్రామంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని నాగార్జునకు నోటీసులు అందాయి. తవ్వకం పనులు చేపట్టారని, వాటిని వెంటనే ఆపేయాలని పేర్కొన్నారు. ప్రముఖ తెలుగు హీరో నాగార్జునకు ఉత్తర గోవాలోని పంచాయతీ బుధవారం స్టాప్ వర్క్ నోటీసు ఇష్యూ చేసింది. మాండ్రేమ్​ పంచాయతీ సర్వే నంబర్‌ 211/2బీ అశ్వేవాడ, మాండ్రేమ్ ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

స్పందించని నాగార్జున..
ఈ పనులను వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్​ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్‌ అమిత్​ సావంత్ స్పష్టం చేశారు. గోవా పంచాయతీ రాజ్ చట్టం కింద ఈ నోటీసులు హీరో నాగార్జునకు జారీ అయ్యాయి. మరోవైపు నాగార్జున ఈ నోటీసులపై స్పందించలేదు. సినిమాలతో పాటు నాగార్జున బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా సక్సెస్‌ అయ్యారు. నాగార్జునకు పలు కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఇందులో భాగమే గోవాలో కడుతున్న బిల్డింగ్‌ అని తెలుస్తోంది.