Worst Traffic Cities : ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా.. ఒక ఇండియన్ సిటీ ఎంపికైంది. ఏదో తెలుసా ? బెంగళూరు !! నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ సంస్థ ‘టామ్‌టామ్’ నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. సర్వేలో భాగంగా ‘టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్’ ఆరు ఖండాల్లోని 55 దేశాల్లో ఉన్న 387 నగరాల్లో అధ్యయనం చేసింది. వాటి సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, మొదలైన వాటి ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చింది. 600 మిలియన్లకు పైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్‌ల డేటా ఆధారంగా ఈ రిపోర్టును తయారు చేశారు. దీని ప్రకారం.. 2023 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు ఆరో ప్లేస్‌లో ఉండగా, మహారాష్ట్ర రాజధాని పూణే ఏడో ప్లేసులో నిలిచింది. వాస్తవానికి 2022 సంవత్సరంలో ఈ జాబితాలో బెంగళూరు సెకండ్ ప్లేసులో ఉండేది. ఇప్పుడు ఆ నగరంలో ట్రాఫిక్ రద్దీ(Worst Traffic Cities) ఒకింత తగ్గడంతో .. ప్రస్తుతం ర్యాంకు కాస్త మెరుగుపడి ఆరో స్థానానికి చేరింది. ఏదిఏమైనప్పటికీ మన దేశంలోని మెట్రో నగరాల్లో ట్రాఫిక్ అనేది అతిపెద్ద సమస్యగా మారిందనే విషయం విస్పష్టం. ఇరుకైన రోడ్ల వల్ల ఈ దుస్థితి ఎదురవుతోంది. రోడ్లను కబ్జా చేసి నడుపుకునే చిరు వ్యాపారాలు కూడా వాహనదారులకు పెద్ద ఆటంకంగా పరిణమిస్తుంటాయి.
We’re now on WhatsApp. Click to Join
నివేదికలోని విశేషాలివీ..
- తాజా నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో బెంగళూరులో 10కిలోమీటర్ల దూరం వాహనంలో వెళ్లేందుకు సుమారు 29 నిమిషాలు పట్టేది. ప్రస్తుతం ఇందుకు 28 నిమిషాల 10సెకన్ల టైం పడుతోంది.
- ప్రస్తుతం పూణేలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 27 నిమిషాల 50 సెకన్ల టైం పట్టేది.
- ఈ లిస్టులో దేశ రాజధాని ఢిల్లీ 44వ స్థానంలో ఉంది. ఢిల్లీలో 10కిలోమీటర్లు ప్రయాణించేందుకు 21 నిమిషాల 40సెకన్ల టైం పడుతోంది.
- ఈ లిస్టులో ముంబై 54వ స్థానంలో ఉంది.
Also Read : Mark Zuckerberg Vs Bill Gates : బిల్‌గేట్స్‌ను దాటేసిన జుకర్‌బర్గ్.. అదెలా సాధ్యమైంది ?
వరల్డ్ నంబర్ 1 ఏ దేశం ?
- ప్రపంచంలోనే అత్యధిక రద్దీ కలిగిన నగరాల్లో బ్రిటన్ రాజధాని లండన్ మొదటి స్థానంలో ఉంది. లండన్‌లో 10కిలోమీటర్లు వాహనంలో వెళ్లడానికి 37నిమిషాల టైం పడుతోంది.
- ఈ జాబితాలో రెండో ప్లేసులో డబ్లిన్ నగరం ఉంది. ఈ సిటీలో 10 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి 29 నిమిషాల 30సెకన్లు పడుతుంది.
- కెనడా రాజధాని టొరంటో మూడో స్థానంలో ఉంది. ఈ సిటీలో 10కిలోమీటర్లు ప్రయాణించడానికి 29 నిమిషాలు టైం పడుతుంది.
- లండన్, డబ్లిన్‌లలో 2022 సంవత్సరంతో పోలిస్తేు దాదాపు 9 కి.మీ ప్రయాణానికి ఒక నిమిషం టైం పెరిగింది.