PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

PM Modi: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఓ మలయాళ వార్తా ఛానెల్ ఆసియానెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని స్పందించారు.

రైళ్లలో టిక్కెట్లు తనిఖీ చేయకుండా టిక్కెట్ కలెక్టర్ ని ఆపివేస్తారా? అవినీతి ఆరోపణలపై విచారణ చేయడమే ఈడీ, సీబీఐల పని. తమ పనిని చేయనివ్వండి అని ప్రధాని మోదీ ఆసియానెట్‌తో అన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్థల పనుల్లో తాను జోక్యం చేసుకోలేనని అన్నారు మోడీ. కేంద్ర ఏజెన్సీలు తమ పనిని చేయకపోతే ప్రతిపక్షాలు ప్రశ్నించాలని ప్రధాని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు తమ విధులను ఎందుకు నిర్వహిస్తున్నాయని అడుగుతున్నాయని అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈడీ 2014 కంటే ముందు 1,800 కేసులు నమోదు చేసిందని, అవి ఇప్పుడు 5,000కు పైగా పెరిగాయని ఒడి గుర్తు చేశారు. ఇక్కడ ఈడీ నిబద్ధతను నొక్కి చెప్పారు ప్రధాని. గత వారం ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో గత దశాబ్దంలో నల్లధనం మరియు అవినీతిని ఎదుర్కోవడంలో ఈడీ పాత్రను ప్రధాని ప్రశంసించారు.

Also Read: Toyota Fortuner Mild-Hybrid: అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్.. ప్ర‌త్యేక‌త‌లివే!