Temple Dress Code : ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలనుకునే భక్తులకు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేశారు. ఈ నూతన సంవత్సరం నుంచి ఆలయం ప్రాంగణంలో గుట్కా, పాన్ నమలడం, ప్లాస్టిక్, పాలిథిన్ వాడటంపై పూర్తి బ్యాన్ విధించారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించాలంటే మంచి దుస్తులు ధరించాలని పూరీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి వెల్లడించారు. హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించిన భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నిబంధన అమల్లోకి రావడంతో 2024 సంవత్సరం మొదటి రోజున ఆలయానికి వచ్చిన చాలామంది పురుష భక్తులు ధోతీ, తువ్వాలు ధరించి కనిపించారు. మహిళలు చీరలు లేదా సల్వార్ కమీజ్‌లు ధరించి దైవ దర్శనానికి(Temple Dress Code) వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మేరకు నియమాలను అమలుచేయాలని ఆలయానికి భద్రత కల్పించే పోలీసులకు ఆలయ కమిటీ సూచనలు అందించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని పేర్కొంది. సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని దాదాపు 1.80 లక్షల మందికిపైగా భక్తులు సందర్శించారు. ఆలయం వెలుపల నిర్మించిన ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) టెన్సైల్ ఫ్యాబ్రిక్ నిర్మాణాన్ని సోమవారం ఉదయం నుంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.
Also Read: Tsunami Warning : సునామీ హెచ్చరిక జారీ.. జపాన్‌లో తీవ్ర భూకంపం
జగన్నాథ ఆలయంలో సొరంగం
పూరీ జగన్నాథ రథయాత్రకు ఏటా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. దీంతోపాటు ఈ గుడిలో ఆశ్చర్యపరిచే విషయాలు, సైన్స్‌కి కూడా అందని ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. వీటితో పాటు తాజాగా జగన్నాథ ఆలయం వద్ద 20 నుంచి 30 మీటర్ల పొడవు ఉన్న ఓ సొరంగం బయట పడింది. ఇది శ్రీక్షేత్ర పంచ తీర్థం నుంచి ఇంద్రద్యుమ్న దేవాలయం వరకు కనిపిస్తోంది. ఈ రహస్య మార్గం గురించి స్థానిక ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులు సొరంగం గురించి పరిశోధన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.