WHO : కోవిడ్ తో 1930 నాటి ఆర్థిక సంక్షోభం !

50 కోట్ల మంది జ‌నాభా ( ఆఫ్ బిలియ‌న్) కోవిడ్ కార‌ణంగా పేద‌రికంలోకి నెట్ట‌బ‌డ్డార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, ప్ర‌పంచ బ్యాంక్ తేల్చాయి.

  • Written By:
  • Publish Date - December 13, 2021 / 04:25 PM IST

50 కోట్ల మంది జ‌నాభా ( ఆఫ్ బిలియ‌న్) కోవిడ్ కార‌ణంగా పేద‌రికంలోకి నెట్ట‌బ‌డ్డార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, ప్ర‌పంచ బ్యాంక్ తేల్చాయి. ఆ మేర‌కు ఆ రెండు సంస్థ‌లు నివేదిక‌ల‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఆర్థిక ప‌రిస్థితులు
స‌హ‌క‌రించ‌క పోవ‌డంతో రెండో వేవ్ లో ఆరోగ్య సేవ‌ల‌ను చాలా మంది పొంద‌లేక‌పోయారని అభిప్రాయ‌ప‌డింది. కోవిడ్ కార‌ణంగా 1930 నాటి ఆర్థిక సంక్షోభం రానుందని అంచ‌నా వేసింది. కోవిడ్ కు ముందే 50కోట్ల మంది త‌మ కుటుంబం బ‌డ్జెట్ లో 10శాతానికిపైగా ఆర్యోగ సేవ‌ల‌కు ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు అంచ‌నా వేసింది.

68శాతం మంది వివిధ ర‌కాల వైద్య సేవ‌ల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా పొందుతున్నారు. HIV, TB మరియు మలేరియా వంటి వ్యాధులకు చికిత్స, క్యాన్సర్, గుండె పరిస్థితులు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించిండంతో పాటు చికిత్స చేయడానికి ఆర్థికంగా పురోగ‌తి సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. సమాజంలోని నిరుపేద లు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఆరోగ్య సేవలను పొందగలిగే సామర్థ్యం తక్కువగా ఉంద‌ని తేల్చింది. పేదరికంలో ఉన్న 90శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖ దిగువ‌కు వెళ్లేలా కోవిడ్ ప్ర‌భావం ఉంద‌ని అంచ‌నా వేసింది.

పౌరులలో ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిణామాలకు భయపడకుండా ఆరోగ్య సేవలను పొందేలా ప్ర‌భుత్వాలు ప్రయత్నాలను వేగంగా పునఃప్రారంభించాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ప్రత్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని నివేదిక‌లో పేర్కొంది. కోవిడ్ వంటి షాక్‌లను తట్టుకునేంత బలమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌, ప్ర‌పంచ బ్యాంకు స్పష్టం చేశాయి. సంపూర్ణ ఆరోగ్య‌ కవరేజీ వైపు ప్ర‌భుత్వాలు ఆలోచించాల‌ని నివేదిక‌లో వివ‌రించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేద, బలహీన జనాభా కోసం సేవలకు ప్రాధాన్యతనిచ్చే ఆలోచనలో ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుండి వ్యక్తులను భ‌య‌ట‌కు తీసుకురావ‌డ‌నికి డేటాను రూపొంస్తున్న‌ట్టు తెలిపింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్ర‌పంచ దేశాల‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డ‌బ్ల్యూహెచ్ వో విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.