Site icon HashtagU Telugu

ఆంధ్రా, కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో క‌ర్నాట‌క ఆంక్ష‌లు

Bangalore Metro

Bangalore Metro

క‌రోనా కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టడానికి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం సిద్ధంగా లేదు. ఒకే కాలేజిలో 258 కేసులు న‌మోదు కావ‌డంతో పాటు ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన కొంద‌రికి `ఓమైక్రిన్‌` ఉంద‌ని అనుమానాలు వ‌స్తున్నాయి. ఆ క్ర‌మంలో క‌ర్నాట‌క రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, సీఎం బొమ్మై మీడియా ముందుకొచ్చాడు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ లాక్ డౌన్ పెట్ట‌లేమని తేల్చి చెప్పాడు. కాలేజీలు, స్కూల్స్ య‌థాత‌దంగా న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది.

కేంద్రం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం బూస్ట‌ర్ డోస్ ఇవ్వడానికి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ల‌కు బూస్ట‌ర్ డోస్ వేయాల‌ని భావిస్తోంది. వ్యాక్సిన్ ప్ర‌భావం ఆరు నెల‌లు మాత్రం ఉంటుంద‌ని భావిస్తోన్న ప్ర‌భుత్వం బూస్ట‌ర్ డోస్ దిశ‌గా అడుగులు వేస్తోంది.దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం క‌ర్నాట‌క ప్ర‌భుత్వం పంపింది. ఆ ఫలితాలు వెలువడిన తర్వాత, అది ఏ రకమైనదో తెలుసుకొని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని భావిస్తోంది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావితమైన దేశాల నుండి తిరిగి వచ్చే ప్రయాణికులపై కఠినమైన నిఘాను క‌ర్నాట‌క ప్ర‌భుత్వం పెట్టింది.
కోవిడ్ ముప్పును ఎదుర్కొనే ప్రయత్నంలో, బళ్లారి మరియు కొడగులలో జిల్లా యంత్రాంగం కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటోంది. బళ్లారి పాలకవర్గం ఆంధ్రా సరిహద్దులో చెక్‌పోస్టులను పరిశీలిస్తుండగా, కొడగులో అధికారులు కేరళ సరిహద్దులో ఆంక్షలను కఠినతరం చేశారు.ఆంధ్రా, కేర‌ళ బోర్డ‌ర్ల వ‌ద్ద కర్నాట‌క ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌ను కొన‌సాగిస్తోంది. కొత్త వేరియెంట్ దూసుకొస్తోన్న త‌రుణంలో అన్ని రాష్ట్రాల అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఆ క్ర‌మంలో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం సరిహ‌ద్దు రాష్ట్రాల బోర్డ‌ర్ల వ‌ద్ద క‌ఠిన ఆంక్ష‌లు పెట్టింది.