Delhi Polls 2025 : 2025 సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ పోల్స్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
Also Read :Samantha Prayer 2025 : నూతన సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు.. సమంత పోస్ట్ వైరల్
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 15 స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయించి, మిగతా స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. తాజాగా కేజ్రీవాల్ ప్రకటనతో అదంతా అవాస్తవం అని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల పేర్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది. ఈ రెండు లిస్టులలో 31 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
Also Read :Cyber Horror 2024 : 2024లో సెకనుకు 11 సైబర్ మోసాలు.. 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు.. 5,842 హ్యాక్టివిస్టుల ఎటాక్స్
2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం 70 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Delhi Polls 2025) ఒంటరిగా పోటీ చేసింది. వీటిలో 62 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 8 సీట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఈనేపథ్యంలో ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. వాస్తవానికి మునుపటితో పోలిస్తే ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది. ఢిల్లీలోని సిక్కు వర్గం ఓటర్లలో చాలామంది ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వీరు కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ఇదే సమయంలో అవినీతి అభియోగాలతో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత వీక్ అయింది. ప్రజల్లో నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లోనూ ఒంటరిగా ముందుకు సాగడం ఆప్‌కు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు.