Site icon HashtagU Telugu

Petrol Price Reduction : వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

Petrol- Diesel Rates

Petrol Diesel Price Express Photo 2 1200

గత కొద్దీ నెలలుగా పెట్రోల్ , డీజిల్ ధరల్లో (Petrol and Diesel Prices) ఎలాంటి మార్పు రావడం లేదనే సంగతి తెలిసిందే. త్వరలో లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్రం (Central Govt) తగ్గించబోతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం చూసి చాలామంది నిజమే కావొచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా కేంద్రం అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయన్న..లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయన్న వెంటనే పెట్రోల్ , డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు తగ్గిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా అలాగే పెట్రోల్ ధరలు తగ్గించబోతుందని అంత భావించారు. కానీ కేంద్రం మాత్రం వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లింది. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join.

పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపు వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Petroleum Minister Hardeep Singh Puri) స్పందించారు. ప్రస్తుతమైతే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రతిపాదన లేదని , అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో అస్థిరత ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రస్తుతం కేంద్రానికి అలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ సింగ్ పూరీ తేల్చారు. ఇంధన ధరల తగ్గింపుపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొట్టిపారేశారు. ఇంధన లభ్యత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు. ఇటీవల క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ భారీ నష్టాలను చవిచూశాయని, ఇంధన ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ధరల పరిస్థితిని సమీక్షిస్తూ తాము స్థిరంగా, సానుకూలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని హర్దీప్ సింగ్ పేర్కొన్నారు.

Read Also : US Cleric Shot: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. మతపెద్దపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..!