India Is Important : చైనాకు శ్రీలంక బలమైన కౌంటర్ ఇచ్చింది. ఇండియా ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. అక్టోబరులో చైనా పరిశోధనల నౌక ‘షియాన్ 6’ను తమ ప్రాదేశిక జలాల్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ప్రకటించారు. కొలంబో, హంబన్‌టోట్ నౌకాశ్రయాలకు చైనా నౌక షి యాన్ అక్టోబరులో చేరుకోనుందనే వార్తలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఈమేరకు ప్రకటన చేసింది. శ్రీలంకను ఎల్లప్పుడూ శాంతియుతంగా ఉంచాలని తాము కోరుకుంటున్నామని శ్రీలంక మంత్రి చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఓపీ ఆధారంగా విదేశీ నౌకలకు తమ దేశంలోకి అనుమతిస్తామని తెలిపారు. నేషనల్ అక్వాటిక్ రిసోర్సెస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీతో కలిసి అధ్యయనం చేయడానికి చైనాకు చెందిన ‘షియాన్ 6’ నౌక శ్రీలంకకు బయలుదేరింది. అది అక్టోబరు నాటికి కొలంబోలోని హంబన్‌టోట్ పోర్టుకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.
Also read : Chicken: మీరు చికెన్ ను కడిగి వండుతున్నారా.. అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే
ప్రపంచ వాణిజ్యంలో 40శాతం హిందూ సముద్రంలోని మలక్కా జల సంధి మీదుగానే జరుగుతోంది. ఈ జలసంధికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే భారత్‌కు చెందిన అండమాన్ దీవులున్నాయి. ఇక్కడ భారత త్రివిధ దళాల సంయుక్త కమాండ్ ఉంది. ఇది మన పొరుగు దేశం చైనాకు ఇబ్బందికరంగా కనిపిస్తోంది. దీంతో భారత్ ను దెబ్బతీసేలా వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలోని 33 కీలక ప్రదేశాల వద్దకు సర్వే నౌకలను పంపించాలని చైనా నిర్ణయించింది.ఈ విషయాన్ని నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే ‘షియాన్ 6’ (India Is Important) అనే పరిశోధనల నౌకను శ్రీలంకకు చైనా పంపుతోంది.