Amit Shah: అలా చేస్తే మరణహోం జరుగుతుందన్నారు..కానీ ఇప్పుడెలా ఉంది..!!

ఉగ్రవాదం కారణంగా జమ్మూ కశ్మీర్ లో 42వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు హోంమంత్రి అమిత్ షా.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 06:41 AM IST

ఉగ్రవాదం కారణంగా జమ్మూ కశ్మీర్ లో 42వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు హోంమంత్రి అమిత్ షా. ఇప్పుడు పరిస్ధితులు మారిపోయాయన్నారు. హర్తాళ్ కు పిలుపునిచ్చేందుకు లేదా రాళ్లదాడికి పాల్పడటానికి ఎవరూ సాహసం చేయనంత భద్రతా పరిస్థితి మెరుగుపడిందని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం, అవినీతిని అంతం చేసిసర్వతోముఖాభివృద్ధిని తీసుకువచ్చి…జమ్మూను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాలని ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.

కాగా టెర్రరిజంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నామని..పరిస్థితిపై భద్రతా బలగాలు పూర్తి నియంత్రణను నిర్దారిస్తున్నామన్నారు. జ‌మ్మూకాశ్మీర్ ప‌ర్య‌ట‌న లో భాగంగా అమిత్ షా ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వంలో కూర్చుని ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో హర్తాళ్‌కు పిలుపునిచ్చే వారిని లేదా భద్రతా బలగాలపై రాళ్లు రువ్వేవారు…కానీ ప‌రిస్థితి మారింది. ఆ ప‌రిణామాల‌ను పూర్తిగా అరికట్టగలిగాము ఇప్పుడు అలాంటి అసాంఘిక చ‌ర్య‌కు పిలుపునిచ్చే ధైర్యం ఎవరికీ లేదు. ఉగ్రవాదులకు లొంగిపోయే అవకాశం ఇచ్చినందున ఇప్పుడు ఒక్క ఎన్‌కౌంటర్ కూడా జరగలేదని షా అన్నారు.

ఉగ్రవాద ఘటనలు 56 శాతం తగ్గాయన్నారు హోంమంత్రి. భద్రతా బలగాల మరణాలు 84 శాతం తగ్గాయని చెప్పారు. టెర్రర్ క్యాడర్‌గా రిక్రూట్‌మెంట్ కూడా తగ్గిందనట్లు చెప్పారు. 2014 తర్వాత మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పరిస్థితి మారిపోయిందన్నారు.