Site icon HashtagU Telugu

PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్

Ktr Fire On Modi

Ktr Fire On Modi

PM Modi: మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ పార్లమెంటరీ విభాగ సమావేశంలో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సభ్యులను “మోదీ జీ” అని కాకుండా “మోడీ” అని పిలవాలని వినమ్రంగా చెప్పారు.

కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల కంటే అధికారాన్ని నిలుపుకోవడంలో బీజేపీ రికార్డు మెరుగ్గా ఉన్నందున, పరిపాలన కోసం ప్రజలు అత్యంత ఇష్టపడే ఎంపికగా పార్టీ మారిందన్నారు. దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోల్ డేటాను కూడా ఆయన ఉదహరించారు.

కాగా నిన్న ప్రధాని సభా వేదిక వద్దకు చేరుకోగానే ఉభయ సభలకు చెందిన పార్టీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కరతాళ ధ్వనుల మధ్య పార్టీ అధినేత జేపీ నడ్డా ఆయనకు శాలువా, పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. మిజోరంలో పార్టీ బలం రెండింతలు పెరిగిందని, తెలంగాణలో అనేక రెట్లు పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు బీజేపీ నాయకులు ఎంతగానో కష్టపడి పనిచేశారని మోడీ అన్నారు.

Also Read: Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: కల్వకుంట్ల కవిత