Site icon HashtagU Telugu

Sonia Gandhi: కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ కీలక సూచనలు..!!

Congress meet

Congress meet

మే 13-15 తేదీల్లో మూడు రోజుల పాటు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించి కాంగ్రెస్ వర్కింట్ కమిటీ కీలక భేటీ సోమవారం సాయంత్రం జరిగింది. ఢిల్లీలోని AICCప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ అధినేత సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీతోపాటు CWCనేతలు హాజరయ్యారు. మేథోమధన సదస్సు విధివిధానాలు, అజెండాపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత సోనియాగాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వేదికలపై ఆత్మవిమర్శ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలకు సూచించారు. ఆత్మవిమర్శ అనేది ఆత్మవిశ్వాసం, నైతికత దెబ్బతీసేలా ఉండకూడదు అని అన్నారు. నిరాశాజనక వాతావరణాన్ని కల్పించేలా ఉండకూడదని ఆమె పార్టీ నేతలకు సూచించారు. మే 13,14,15 తేదీల్లో ఉదయ్ పూర్ లో మేథోమధనం సదస్సు జరుగుతుందని గుర్తు చేశారు సోనియా. నాలుగువందల మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.

ఇక ఆరు గ్రూపులుగా మేథోమధన చర్చలు జరగనున్నాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత వ్యవస్తీక్రుత సమస్యలపై సంప్రదింపులు జరుగుతాయని సోనియా గాంధీ వివరించారు. ఏ గ్రూపు చర్చల్లో పాల్గొనాలనుకుంటునున్నారో అంశంపై ఇప్పటికే ప్రతినిధులకు సమాచారం అందిందని చెప్పారు. మే 15న మధ్యాహ్నం CWCఆమోదం తర్వాత ఉదయ్ పూర్ నవ్ సంకల్పాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందని సోనియా వివరించారు రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో తిరిగి పార్టీ అధికారాన్ని చేపట్టాలని సంకల్పించుకుంది. ఈ దిశవేగంగా అడుగులు వేస్తోంది ఆ పార్టీ. దీనిలో భాగంగానే ఉదయ్ పూర్ మేథోమధన సదస్సుకు రెడీ అవుతోంది కాంగ్రెస్ పార్టీ.