Rahul Gandhi Hindi: `హిందీ భాష`తో రాహుల్ కు ఇర‌కాటం

హిందీని జాతీయ భాష‌గా చేయ‌డం కార‌ణంగా క‌న్న‌డ గుర్తింపు పోతుంద‌ని క‌ర్ణాట‌క‌లోని మేధావులు రాహుల్ వ‌ద్ద ప్ర‌స్తావించారు.

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 02:03 PM IST

హిందీని జాతీయ భాష‌గా చేయ‌డం కార‌ణంగా క‌న్న‌డ గుర్తింపు పోతుంద‌ని క‌ర్ణాట‌క‌లోని మేధావులు రాహుల్ వ‌ద్ద ప్ర‌స్తావించారు. ఆయ‌న ప‌లు విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులతో స‌మావేశం అయిన సంద‌ర్భంగా రాహుల్ కు భాష‌కు సంబంధించిన ప్ర‌శ్న ఎదుర‌యింది. హిందీని మాత్రమే జాతీయ భాషగా చేసి కన్నడ వంటి ప్రాంతీయ భాషల గుర్తింపుకు ముప్పు వాటిల్లే విధానం తీసుకోమ‌ని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

కన్నడ భాష‌కు గుర్తింపు గురించి చర్చ జరిగిన సంద‌ర్భంగా ప్రతి ఒక్కరికీ మాతృభాష ముఖ్యమన్నారు రాహుల్‌. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కుగా ఉన్న భాష‌ల‌న్నింటికీ గౌర‌విస్తామ‌ని చెప్పారు. ఎఐసిసి రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ రాజీవ్ గౌడ మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్‌ఇపి (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) అమలు విద్యా రంగంలో సమస్యలను సృష్టిస్తుంద‌ని విమ‌ర్శించారు.