Site icon HashtagU Telugu

India Pakistan Ceasefire : ‘కాల్పుల విరమణ’పై భారత ఆర్మీ కీలక ప్రకటన

India Pakistan Ceasefire Dgmo Talks Indian Army

India Pakistan Ceasefire : ఇటీవలే పాకిస్తాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ కీలక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణకు నిర్దిష్ట గడువు అనేది ఏదీ లేదని తేల్చి చెప్పింది. ఈ రోజు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)తో భారత డీజీఎంఓ చర్చలు కూడా జరగవని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ అనేది కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చింది.

Also Read :Gulzar House : హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

భారత్, పాక్.. ఏం డిసైడ్ చేశాయి ? 

ఈరోజు (ఆదివారం)తో భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారాన్ని భారత ఆర్మీ ఖండించింది. కాల్పుల విరమణకు ముగింపు తేదీ అనేది లేదని పేర్కొంది. ఈ నెల(మే) 10వ తేదీన భారత్, పాక్(India Pakistan Ceasefire) డీజీఎంఓలు ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందమే కొనసాగుతోందని తెలిపింది. ఆరోజు ఇరుదేశాల డీజీఎంఓల స్థాయిలో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాల కొనసాగింపుపై పూర్తి ఫోకస్ ఉంటుందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మే 10న భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్, పాకిస్తాన్ డీజీఎంఓ కాశిఫ్ అబ్దుల్లా మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఇరుదేశాల సైన్యాలు సరిహద్దుల్లో కాల్పులు ఆపాలని ఉమ్మడిగా నిర్ణయించారు. ఇరుదేశాల సైన్యాలు మిస్సైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో దాడులు చేసుకోవడాన్ని ఆపాలని డిసైడ్ చేశారు. దీంతో మే 10 నుంచి భారత్, పాక్ మధ్య శాంతి వాతావరణం ఏర్పడింది.

Also Read : Weekly Horoscope : వారఫలాలు.. మే 19 నుంచి మే 25 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

పాక్.. అలా దారికొచ్చిందా ? 

అప్పట్లో భారత్, పాక్ చర్చల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు. భారత ప్రధాని మోడీకి ట్రంప్ స్వయంగా కాల్ చేసి.. కాల్పుల విరమణకు ఒప్పించారని అంటున్నారు. అయితే పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లో అణ్వస్త్రాలు దాచిన ఒక సొరంగం వద్ద భారత మిస్సైళ్లు పడినట్లు సమాచారం. అక్కడ జరిగిన భారీ పేలుడుతో పాకిస్తాన్ భయపడి.. భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చిందని చెబుతున్నారు.